NTV Telugu Site icon

Indian Railways: ఒక అమ్మాయి కారణంగా 42ఏళ్ల మూతపడిన రైల్వే స్టేషన్.. ఎక్కడుందంటే?

Haunted Railway Station

Haunted Railway Station

Indian Railways: భారతీయ రైల్వే స్టేషన్లకు సంబంధించిన కొన్ని కథనాలు తరచుగా వింటూనే ఉంటాయి. తెలియనివి కూడా ఇంకా చాలానే ఉన్నాయి. వాటిలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని వాస్తవాలు ఉన్నాయి. అలాంటి ఒక వాస్తవాన్ని గురించి ఈరోజు చెప్పుకుందాం. భారతదేశంలోని ఒక రైల్వే స్టేషన్ 42 సంవత్సరాలు మూసివేయబడింది. దీని మూసివేత వెనుక కథ ఒక్క అమ్మాయికి సంబంధించినది. ఇక్కడి నుంచి గతంలో రైళ్లు వెళ్లేవి, కానీ 42 ఏళ్లుగా ఒక్క రైలు కూడా ఆగలేదు. ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో ఉంది. దీని పేరు బెగన్‌కోడోర్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ 1960లో ప్రారంభించబడింది. ఈ స్టేషన్‌ను ప్రారంభించడంలో సంతాల్ రాణి శ్రీమతి లచన్ కుమారి సహకరించారు.

ఈ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన తర్వాత కొన్నేళ్లపాటు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత వింత సంఘటనలు జరగడం ప్రారంభించాయి. 1967లో ఓ ఉద్యోగి ఇక్కడ ఆడ దెయ్యాన్ని చూసినట్లు చెప్పాడు. ఇతర రైల్వే ఉద్యోగులకు కూడా చెప్పినప్పటికీ ఆయన మాటలను పట్టించుకోలేదు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే జరిగిన మరో పెద్ద సంఘటన ఆ ఉద్యోగి చెప్పిన మాటలను అందరూ నమ్మేలా చేసింది. కొన్ని రోజుల తరువాత బేగునకోడోర్ స్టేషన్ మాస్టర్, అతని కుటుంబం రైల్వే క్వార్టర్‌లో శవాలై కనిపించారు. ఈ ఘటన వెనుక ఓ మహిళ దెయ్యం ఉందని ప్రజలు అంటున్నారు. దీని తరువాత ఈ దెయ్యం గురించి చాలా కథలు ప్రజల ముందుకు వచ్చాయి.

Read Also:Skanda: కల్ట్ సాంగ్ కూడా సరిపోవట్లేదు… ఉన్న బజ్ కూడా పోయేలా ఉంది

సూర్యాస్తమయం తర్వాత ఈ రైల్వే స్టేషన్‌ మీదుగా రైలు వెళ్లినప్పుడల్లా ఆ రైలు వెంట ఆ మహిళ దెయ్యం పరుగెత్తడం ప్రారంభించిందని అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. అంతేకాదు కొన్నిసార్లు రైలు కంటే వేగంగా పరిగెత్తేదని చెప్పారు. చాలా సార్లు ఆ దెయ్యం రైలు పట్టాలపై డ్యాన్స్ చేస్తూ కూడా కనిపించిందట. ఇలాంటి సంఘటనల తర్వాత ఈ రైల్వే స్టేషన్‌ను హాంటెడ్‌గా పిలిచేవారు. ఈ స్టేషన్‌పై ప్రజల్లో భయాందోళనలు వ్యాపించడంతో ప్రజలు ఇక్కడికి రావడం మానేశారు. ఇది రికార్డులో కూడా నమోదైంది. ఇది మాత్రమే కాదు, దీని కథ కోల్‌కతా రైల్వే స్టేషన్ నుండి రైల్వే మంత్రిత్వ శాఖకు చేరుకుంది.

రైల్వే ఉద్యోగులు కూడా ఇక్కడికి పని చేసేందుకు రావాలంటే భయపడేవారు. ఈ రైల్వే స్టేషన్‌కు పంపిన వారు మాకు ఉద్యోగం లేకున్నా ఫర్వాలేదని భయంతో వెళ్లిపోయేవారు. ఇక్కడ నుంచి ప్రయాణికులెవరూ ఎక్కడం లేదా దిగకపోవడంతో రైళ్లు కూడా ఇక్కడ నిలిచిపోయాయి. లోకో పైలట్ ఈ స్టేషన్ సమీపాన్ని గుర్తించిన వెంటనే, అతను రైలు వేగాన్ని పెంచుతాడని, తద్వారా రైలు త్వరగా స్టేషన్‌ను దాటగలదని చెబుతుంటారు. ఈ స్టేషన్ రాగానే ప్రజలు భయపడిపోయి కిటికీలు, తలుపులు అన్నీ మూసేసేవారు. 42 ఏళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగింది. అయితే ఆ తర్వాత 2009లో గ్రామస్తుల కోరిక మేరకు అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ మరోసారి ఈ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. అప్పటి నుండి ఇక్కడ ఏ దెయ్యం చూసిన దాఖలాల్లేవు. కానీ నేటికీ ప్రజలు సాయంత్రం స్టేషన్ వద్ద ఆగరు. ప్రస్తుతం ఈ స్టేషన్‌లో దాదాపు 10 రైళ్లు ఆగుతాయి. కొన్నిసార్లు పర్యాటకులు కూడా ఇక్కడ సందర్శించడానికి వస్తారు.

Read Also:Women Reservation Bill: ముప్పై ఏళ్ల క్రితం రాజ్యసభలో ఆమోదం.. మరి ఆ బిల్లు ఎందుకు నిలిచిపోయింది?

Show comments