NTV Telugu Site icon

Chiranjeevi : నా ఫ్యాన్స్ కి హ్యాట్సాఫ్.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..

chirnjeevi

chirnjeevi

టాలీవుడ్ మెగా హీరో చిరంజీవి గురించి ఎంత చెప్పిన తక్కువే.. స్వయం కృషితో పైకొచ్చిన నటుడు.. అందుకే మెగాస్టార్ అయ్యాడు.. వయసు పెరుగుతున్నా సినిమాలను వదలకుండా కుర్ర హీరోలకు షాక్ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఆయన సినిమాల వల్ల జనాలకు ఏదోక సందేశం ఇస్తూ వస్తున్నాడు.. అంతే నిజ జీవితంలో కూడా చిరు హీరోనే.. ఎంతోమందికి సాయం అందించాడు.. ఆయన చేసిన సేవలకు ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది..

నిన్న ఆయన రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే.. అనంతరం చిరంజీవి ఎన్టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో ముచ్చటించారు.. ఈ సందర్బంగా ఎన్నో విషయాలను పంచుకున్నారు.. రాజకీయాలు ఎలా ఉంటాయన్న విషయం పై చర్చించారు.. అంతేకాదు బ్లడ్ బ్యాంక్ను ఎలా మొదలు పెట్టారన్న విషయాన్ని కూడా చిరు చెప్పాడు..

బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చెయ్యడానికి నా ఫ్యాన్స్ కారణం.. ఎంతోమంది బ్లడ్ దొరక్క చనిపోయారు. అది చూసి తట్టుకోలేక పోయాను.. మొదట నా ఫ్యాన్స్ ను మోటివేట్ చేశాను.. వాళ్లు నా మీద గౌరవంతో బ్లడ్ ఇచ్చారు.. అంతేకాదు చాలా మందిని మోటివేట్ చేశారు.. అలాగే బ్లడ్ బ్యాంక్ ఏర్పడింది.. ఇదంతా నా ఫ్యాన్స్ వల్లే జరిగింది.. ఎప్పుడైనా ఇదే చెప్తాను.. వారు ముందుకు రాకుంటే ఏం చేసేవాడిని కాదు.. ఆ విషయంలో నా ఫ్యాన్స్ కి హ్యాట్సాఫ్ అని చెప్పాలి అని చిరు అన్నాడు.. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

Show comments