సమ్మర్ సీజన్ ప్రారంభమైంది. ఈ సమయంలో చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు ఈత కోసం స్విమ్మింగ్ పూల్స్ కి వెళ్తుంటారు. ఈత నేర్చుకోవడం కోసం కొందరు, ఎండతాపం నుంచి ఉపశమనం పొందేందుకు మరికొందరు స్విమ్మింగ్ పూల్ కు వెళ్తుంటారు. అయితే ఇటీవల స్విమ్మింగ్ కోసం వెళ్లిన వారు ప్రమాదవశాత్తు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. మీర్పేట్ పరిధిలో ఈత కోసం స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళిన హసన్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
Also Read:Warangal: కేఎంసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేయని ఏసీలు.. సర్జరీలను నిలిపివేసిన వైద్యులు
హసన్ స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం రాచలపల్లె గ్రామం. ఉపాధి కోసం వచ్చి మీర్ పేటలోని స్వస్తిక్ టిఫిన్ సెంటర్ లో మాస్టర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళాడు. పూల్ లో డైవ్ కొడుతూ.. వీడియో తీయమని ఫ్రెండ్స్ కి చెప్పాడు హసన్. చిన్న పిల్లలు స్విమ్ చేసే 4 ఫీట్ల లోతు వద్ద డైవ్ చేశాడు హసన్. పూల్ లో డైవ్ చేయగా.. కింద భాగంలో తల తగిలి గాయాలపాలయ్యారు. తల నేరుగా పూల్ గోడకు తగలడంతో తీవ్ర గాయం అయ్యింది. తీవ్ర రక్తస్రావం కాగా హసన్ ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హసన్ మృతి చెందాడు.
