Hassan Eisakhil: తండ్రికి తగ్గ తనయుడు.. 28 బంతుల్లో సెంచరీ.. 16 సిక్సర్లతో విధ్వంసం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hassan Eisakhil: ఆఫ్ఘనిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ కుమారుడు హాసన్ ఈసాఖిల్ క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్నాడు. 19 ఏళ్లున్న హాసన్.. ఆఫ్ఘనిస్థాన్-11, ఉజ్బెకిస్థాన్ మధ్య జరిగిన ఏకైక అనధికారిక టీ20 మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టీ20 క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.
ఓపెనర్‌గా బరిలోకి దిగిన హాసన్ ఈసాఖిల్ తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించాడు. మైదానం నలుమూలలా భారీ సిక్సర్లు, అద్భుతమైన ఫోర్లతో చెలరేగిపోయిన హాసన్ కేవలం 34 బంతుల్లో 4 ఫోర్లు, 16 భారీ సిక్సర్లు, 352.94 స్ట్రైక్‌రేట్ తో 120 పరుగులు చేశాడు. అయితే ఇన్నింగ్స్ మధ్యలో అసౌకర్యం కారణంగా హసన్ రిటైర్డ్ అవుట్ గా మైదానం వీడాల్సి వచ్చింది.
Also Read
హసన్ ఈసాఖిల్, కెప్టెన్ ఇమ్రాన్ మీర్ కలిసి తొలి వికెట్‌కు 181 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇమ్రాన్ మీర్ కూడా 74 పరుగులతో రాణించడంతో ఆఫ్ఘనిస్థాన్-11 జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 323 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. గత కొద్దికాలంగా హసన్ ఈసాఖిల్ తన అద్భుత ప్రదర్శనతో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశవాళీ టోర్నీల్లో తన తండ్రి మహ్మద్ నబీతో కలిసి కూడా ఆడుతున్న హాసన్, ఇప్పటికే పలు లీగ్‌ల్లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
HUNDRED! 💯
Hassan Eisakhil puts on a brilliant batting effort and brings up an explosive half-century off just 28 balls against Uzbekistan!
Follow the match live: https://t.co/SCEUtfB5wG#AFGXIvUZB | #e& – Go for More | #SuperCola – Share the Love pic.twitter.com/uolQqPAszo
— Afghanistan Cricket Board (@ACBofficials) July 10, 2026
ఇప్పటివరకు హసన్ 4 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 14 లిస్ట్-A మ్యాచ్‌లు, 38 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు నమోదు చేసిన అతడు ఇటీవల భారత్, శ్రీలంకలతో జరిగిన ట్రై సిరీస్‌లో పాల్గొన్న ఆఫ్ఘనిస్థాన్-A జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. మహ్మద్ నబీ తన కుమారుడితో కలిసి ఆఫ్ఘనిస్థాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని ఎన్నోసార్లు తన కోరికను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం హసన్ ప్రదర్శన చూస్తుంటే ఆ కల త్వరలోనే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Hassan Esakhil retired out after scoring 120 runs off just 34 balls, including 4 fours and 16 sixes. 💪💙🔥
He reached his first fifty in 17 balls, and his second fifty in just 11 balls. 🥶
Here's a short highlight of Hassan's innings: https://t.co/fx2Fw2pKan pic.twitter.com/mAL1dp4Iuw
— Noor Ahmad Nation 🇦🇫 (@kohinr_15) July 10, 2026
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!