NTV Telugu Site icon

Hash Oil : 1 కిలో హాష్ ఆయిల్ పట్టివేత..

Has Oil

Has Oil

నూతన సంవత్సరం వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. అయితే.. ఇదే అదునుగా భావిస్తున్న స్మగ్లర్లు మాదకద్రవ్యాలను సరఫరా చేసేందుకు పూనుకుంటున్నారు. దీంతో గత వారం రోజులుగా నగరంలో డ్రగ్స్‌ భారీగా పట్టుబడుతున్నాయి. అయితే.. తాజాగా చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్ పేట యశోద హాస్పిటల్ సమీపంలో (గాంజా) హాష్ ఆయిల్ విక్రయాలు జరుగుతున్నయన్న నమ్మదగిన సమాచారంతో ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ , చాదర్ ఘాట్ పోలీసులు కలసి ముగ్గురు డ్రగ్ సప్లైర్స్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది.

Also Read : Cobra Fight : తుపాకీ కాల్పులకు ఎదురుతిరిగిన పాము
వీరి వద్ద నుంచి 1కిలో హాష్ ఆయిల్ , 3 సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. చాదర్ ఘాట్ పీ ఎస్ లో మీడియా సమావేశంలో మలక్ పేట ఏసీపీ వెంకటరమణ , సి ఐ ప్రకాష్ రెడ్డి వివరాలు వెల్లడించారు. విలాసవంతమైన జీవితం కు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించుకునేందుకు యువత తప్పడు మార్గాలు ఎంచుకుని గాంజా హాష్ ఆయిల్ ను విక్రయాలు చేస్తున్న జగద్గిరిగుట్ట కు చెందిన సందీప్ గౌడ్,వినయ్ కుమార్ రెడ్డి, మల్కాజిగిరి కి చెందిన జి పృథ్వీరాజ్‌లను మలక్ పేట యశోద హాస్పిటల్ వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
Also Read : Peddireddy Ramachandra Reddy: ఇతర రాష్ట్రాలకు ఏపీ ఒక మోడల్ స్టేట్‌గా నిలుస్తుంది