Dhanush Found His Real-Life Seeta?: సీతారామం, హాయ్ నాన్న లాంటి మెస్మరైజింజ్ చిత్రాలతో సినీ ప్రియుల మనసుల్లో చెదరని ముద్రను వేసుకున్నారు మృణాల్ ఠాకూర్. ఇప్పటికీ ఆమెకు సీతారామం సీతగా టాలీవుడ్‌లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతీశయోక్తి కాదు. ఇటీవల ఈ ముద్దుగుమ్మ వరుస రూమర్‌లతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఏంటా కహానీ.. ఒక లుక్కే్ద్దాం పదండి..
READ MORE: Minister Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. యువత – పరిశ్రమల అనుసంధానం..!
అవునూ వాళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారా?
కొన్ని రోజులుగా ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్‌లో ఉన్నారంటూ తెగ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా వాళ్లిద్దరూ పలుమార్లు కలిసి కనిపించడం, ఈవెంట్‌లకు వెళ్తుండటంతో అవునూ వాళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారా? అనే అనుమానాన్ని సోషల్ మీడియా కోడై కూస్తుంది.
మృణాల్ వాళ్లిద్దరిని కలిశారని టాక్..
ధనుష్ సిస్టర్స్ కార్తిక, విమల గీతను మృణాల్ కలిసినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇంకో ముచ్చట ఏమిటంటే ఇప్పటికే వాళ్లిద్దరిని ఆమె సోషల్ మీడియాలో ఫాలో చేస్తున్నారు. ఓ ఆంగ్ల మీడియా పత్రిక మరింత ముందుకు వెళ్లి.. ధనుష్ ఏకంగా వాళ్ల కుటుంబసభ్యులకు ఈ బ్యూటీని పరిచయం చేశారని పేర్కొంది. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకు ఈ వార్తలపై హీరోహీరోయిన్‌లిద్దరూ స్పందించలేదు.
వైరల్‌గా మారిన ధనుష్ వీడియోలు..
రీసెంట్‌గా జరిగిన ‘సన్ ఆఫ్ సర్దా్ర్ 2’ మూవీ ఈవెంట్‌లో ధనుష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఈవెంట్‌లో ఆయన మృణాల్‌తో క్లోజ్‌గా ఉన్న వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత జరిగిన ఆమె పుట్టిన రోజు వేడుకల్లోను ‘సార్’ సందడి చేశారు. ఈ దెబ్బతో హీరోహీరోయిన్లు రిలేషన్‌లో ఉన్నారన్న ప్రచారం జోరందుకుంది.
ఆమెతో విడాకులు..
సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యను 2004లో ధనుష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2022 జనవరిలో వారిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. 2024 నవంబర్‌లో వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది.
READ MORE: YS Jagan: పులివెందుల వైసీపీ నేతలకు వైఎస్ జగన్ ఫోన్.. దాడిపై ఆరా
