Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Haryana Stops Drug Production At Plant Making Cough Syrups Flagged By Who

Cough Syrup: దగ్గు సిరప్‌ల ఘటన.. ఉత్పత్తిని నిలిపివేస్తూ సర్కారు ఆదేశాలు

Published Date :October 12, 2022 , 1:55 pm
By Mahesh Jakki
Cough Syrup: దగ్గు సిరప్‌ల ఘటన.. ఉత్పత్తిని నిలిపివేస్తూ సర్కారు ఆదేశాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Cough Syrup: దగ్గు, జలుబు నివారణకు సిరప్‌లు వినియోగించడం వల్ల గాంబియాలో 66 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించిన వారం రోజుల అనంతరం వాటి ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. చిన్నారులను మింగేసిన దగ్గు సిరప్‌ కంపెనీ మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌లో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అంతే కాకుండా ఆ కంపెనీకి సంబంధించిన 3 ఔషధాల నమూనాలను కోల్‌కతాలోని సెంట్రల్‌ డ్రగ్‌ ల్యాబ్‌కు పంపారు. ఆ పరీక్షల నివేదికల అనంతరం ఆ కంపెనీపై చర్యలు తీసుకుంటామని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ బజ్ వెల్లడించారు.

అయితే కేంద్ర, హర్యానా రాష్ట్ర ఔషధ విభాగాల సంయుక్త తనిఖీల్లో తయారీలో దాదాపు 12 లోపాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో మొత్తం ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కంపెనీకి జారీ చేయబడిన ఒక షోకాజ్ నోటీసులో కంపెనీ సందేహాస్పదమైన ఔషధాలను తయారు చేయడానికి, పరీక్షించడానికి ఉపయోగించే పరికరాలు, సాధనాల సమాచారానికి సంబంధించి పుస్తకాన్ని నివేదించడంలో కంపెనీ విఫలమైంది. దగ్గు సిరప్‌ల తయారీ కోసం పొందిన ప్రమాదకరమైన రసాయనాల బ్యాచ్ సంఖ్యలు పేర్కొనబడలేదు.రసాయనాలలో ప్రొపైలిన్ గ్లైకాల్, సార్బిటాల్ సొల్యూషన్, సోడియం మిథైల్ పారాబెన్ ఉన్నాయి. తయారీ ప్రక్రియలో పరీక్షలకు సంబంధించిన వివరాలూ ఇవ్వనట్లు తేలింది. ఈ మందులు నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని గతంలోనే నాలుగు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోపక్క 2011లో వియత్నాం ఈ సంస్థపై నిషేధం విధించింది.

Delhi : ఫ్రెండ్ అని నమ్మిపోతే.. మత్తుమందు కలిపి..

సిరప్‌ తయారీ, ప్రక్రియ పద్ధతులను నివేదించడంలో విఫలమైంది. అలాగే సిరప్‌కి సంబంధించి పరీక్షల నివేదికలను అందించలేకపోయింది. అంతేగాదు తయారి తేదీకి, ఉత్పత్తి అనుమతించిన తేదీకి చాలా వ్యత్యాసం ఉందంటూ పలు లోపాలను లేవనెత్తింది. ఈ మేరకు హర్యానా స్టేట్‌ డ్రగ్స్‌ కంట్రోలర్‌ షోకాజ్‌ నోటీసుకు ప్రతిస్పందించేందుకు సదరు కంపెనీకి సుమారు 7 రోజుల వ్యవధి ఇచ్చింది. సదరు కంపెనీపైన వచ్చిన ఆరోపణలు నిజమైతే గనుక కంపెనీ తయారీ లైసెన్సు రద్దు చేయడమే గాక తదుపరి చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • central drug lab
  • cough syrup
  • Drug Production
  • Gambia
  • Haryana

తాజావార్తలు

  • Allu Arjun: అల్లు అర్జున్ పుట్టినరోజున అదిరిపోయే అప్‌డేట్స్.. ‘AA22’ టైటిల్ ఫిక్స్?

  • Vaibhav vs Bumrah: “ఇలా ఉన్నావేంట్రా”.. బుమ్రాకే చుక్కలు చూపించిన వైభవ్.. చరిత్రలో నిలిచిపోయే యంగ్ స్టార్ ఫైట్!

  • Sumanth: మృణాల్‌కు క్షమాపణలు చెప్పిన సుమంత్..!

  • Municipal Ward Delimitation: మున్సిపాలిటీల పునర్విభజన ప్రక్రియకు గడువు పెంచిన సర్కార్..

  • Trump: సంపూర్ణ విజయం సాధించాం.. ఇరాన్‌ ఒప్పందం వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions