Harassment Case: లైంగిక వేధింపుల కేసులో హర్యానా మంత్రి సందీప్ సింగ్‌ను పోలీసులు ఆదివారం దాదాపు ఏడు గంటల పాటు విచారించారని మంత్రి తరపు న్యాయవాది డి.సబర్వాల్ సోమవారం తెలిపారు. ఆయన రెండు ఫోన్‌లోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. ఆయన కేసుకు సంబంధించి పత్రాలను కూడా సమర్పించారని.. విచారణలో పోలీసులకు సహకరిస్తున్నారని తెలిపారు. ఆయన న్యాయమైన విచారణను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. దర్యాప్తుకు సహకరించాలని సందీప్ సింగ్‌కు పోలీసులు 41ఎ నోటీసు పంపారు. నోటీసు అందిన తర్వాత సందీప్ సింగ్ ఉదయం 11.30 గంటలకు సెక్టార్ 26 పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. సమాచారం మేరకు పోలీసులు అతడిని రాత్రి 7 గంటల వరకు ప్రశ్నించారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రతిపక్షాల నిరసనల మధ్య సందీప్ సింగ్ తన క్రీడలు, యువజన వ్యవహారాల పోర్ట్‌ఫోలియో నుంచి వైదొలిగారు, కానీ మంత్రిగా కొనసాగుతున్నారు.
డిసెంబరులో ఒక మహిళా అథ్లెటిక్ కోచ్ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి, మాజీ భారత హాకీ స్టార్ కూడా అయిన మంత్రి గత ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు తనను తరచుగా అసభ్యకరమైన సందేశాల ద్వారా వేధించారని ఆరోపించారు. మంత్రి తనను బెదిరించారని ఆమె పేర్కొంది. చండీగఢ్ పోలీసులు సందీప్ సింగ్‌పై ఐపీసీ 354, 354ఏ, 354బీ, 342, 506 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.గత వారం, బుధవారం పోలీసులు ఆయన ఇంటికి చేరుకుని, చండీగఢ్‌లోని సెక్టార్ 26 పోలీస్ స్టేషన్‌లో అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.
Delhi Mayor Polls: ఢిల్లీలో హైటెన్షన్.. వీధుల్లో ఆప్, బీజేపీ పోటాపోటీ నిరసనలు
తన విలేకరుల సమావేశంలో మహిళా కోచ్ సందీప్ సింగ్‌ను కేబినెట్ నుంచి తొలగించాలని, ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ను డిమాండ్ చేశారు. ఆరోపణల నేపథ్యంలో, దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నందున, తాను క్రీడల శాఖ బాధ్యతలను సీఎంకు అప్పగించినట్లు సందీప్ సింగ్ జనవరి 1న చెప్పారు. ఈ ఆరోపణలు తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమేనని ఆయన పేర్కొన్నారు.