Site icon NTV Telugu

Jalebi Baba : దెబ్బకి దెయ్యం వదిలిందిగా.. 120మందిపై అత్యాచారం

Haryana

Haryana

Jalebi Baba: పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానంటూ పోయిన మహిళలపై అత్యాచారం చేసిన జిలేబీ బాబా పాపం పండింది. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుచారు. ఆఖరుకు ఈ కీచక బాబాకు కోర్టు శిక్ష విధించింది. సంచలనం రేపిన జిలేబీ బాబా వ్యవహారం హరియాణా రాష్ట్రానికి చెందినది. జిలేబీ బాబా అసలుపేరు అమర్‌వీర్‌. అతడు పంజాబ్‌లోని మాన్సా్కు చెందిన వాడు. ఇరవై ఏళ్ల క్రితం భార్యతో సహా హరియాణాకు వచ్చిన అమర్‌పురి తహానా రైల్వే రోడ్డులో జిలేబీ దుకాణం తెరిచాడు. కొన్నాళ్లకు భార్య మృతి చెందింది. రెండేళ్ల తర్వాత తోహానాలో జిలేబీ బాబాగా అవతారమెత్తి జనాల దృష్టిని ఆకర్షించాడు.

Read Also: Kiraak RP: ఆడవాళ్లతో మళ్లీ దుకాణం తెరిచిన జబర్దస్త్ కిర్రాక్ ఆర్పీ

తమకు పట్టిన దెయ్యాలను వదిలిస్తామని ప్రకటించుకున్నాడు. మాయమాటలు నమ్మిన కొందరు మహిళలు అతడి దగ్గరకి వెళ్లారు. ఈ క్రమంలోనే వారిని లొంగదీసుకున్నాడు. దెయ్యాలను వదిలించే క్రమంలో ద్రవంలో మత్తుమందు కలిపి వారితో తాగించేవాడు. అనంతరం అకృత్యాలకు పాల్పడేవాడు. అంతేకాకుండా వీడియోలు సైతం తీసి బ్లాక్‌మెయిల్‌ చేసేవాడు. వారి నుంచి డబ్బు డిమాండ్‌ చేసేవాడు. మరికొందరిని తనతో రిలేషన్‌ కొనసాగించమని వేధించేవాడు.

Read Also : JM Joshi : మాఫియాతో లింకు పెట్టుకున్నందుకు తీసుకెళ్లి పదేళ్ల శిక్ష వేశారు

ఈ క్రమంలో జిలేబీ బాబా ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నప్పటి వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ధైర్యం తెచ్చుకున్న మరికొందరు బాధిత మహిళలు ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోజిలేజీబాబా పాపం పండింది. 2018లో ఫతేహాబాద్ జిల్లాలోని తోహానాలో ఉన్న జిలేబీబాబా నివాసంపై పోలీసులు దాడి చేసి, తనిఖీలు చేయగా 120కి పైగా వీడియోలు లభించాయి. వీటితోపాటు కొన్ని మత్తుపదార్ధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియోలన్నీ మొబైల్‌ ఫోన్ల ద్వారా చిత్రీకరించినట్లు గుర్తించారు. నిందితుడిని పలు సెక్షన్ల కింద పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. 120 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఆ కీచకుడికి ఫతేహాబాద్ కోర్టు జనవరి 7 (శనివారం)న శిక్ష ఖరారు చేసింది.

Exit mobile version