NTV Telugu Site icon

Vinesh Phogat: వినేష్ ఫోగట్‌కు రివార్డు ప్రకటించిన హర్యానా ప్రభుత్వం..ఎంతంటే?

Vinesh Phogat

Vinesh Phogat

పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు ముందు అనర్హులుగా ప్రకటించబడిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. గురువారం ఉదయం ఈ విషయాన్ని ఎక్స్‌ ద్వారా తెలిపారు. ఓవర్ వెయిట్ కారణంగా పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 ఫైనల్‌లో ఆడకుండా అనర్హత వేటు పడడంతో నిరుత్సాహానికి గురైన వినేష్.. రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పారు. కాగా..వినేష్ ఫోగట్‌ను పతక విజేతగా స్వాగతిస్తామని, సత్కరిస్తామని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రకటించారు.

READ MORE: AP Crime: దారుణం.. రెండు రోజుల పాటు ఇంట్లో నిర్బంధించి మహిళపై అత్యాచారం

ఒలింపిక్స్‌లో రజత పతక విజేతకు హర్యానా ప్రభుత్వం అందించే సన్మానాలు, రివార్డులు, సౌకర్యాలను వినేష్ ఫోగట్‌కు కూడా కృతజ్ఞతతో అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. తాను ఛాంపియన్‌ అని సీఎం సైనీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇంతకుముందు.. ‘కుస్తీ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను. మీ కల, నా ధైర్యం చెదిరిపోయాయి. ఇక నాకు పోరాడే బలం లేదు. రెజ్లింగ్‌కు గుడ్‌బై (2001-2024). నేను మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. నన్ను క్షమించండి’ అని ఎక్స్‌లో వినేశ్‌ ఫొగాట్‌ రాసుకొచ్చారు.

READ MORE:Vinesh Phogat Retirement: వినేశ్‌ ఫొగాట్‌ షాకింగ్‌ నిర్ణయం.. నేను ఓడిపోయా అంటూ..!

తన బరువు విభాగం (50కేజీ) కన్నా 100 గ్రాములు ఎక్కువగా ఉండటం వినేశ్‌ను నిరాశపరిచింది. ఎక్కువ బరువ వల్ల ఆమె అనర్హతకు గురైంది. ఆ 100 గ్రాములు తగ్గించుకోవడానికి మరికొంత సమయం ఇవ్వాలని అధికారులను ఎంత బతిమాలినా ఫలితం లేకుండాపోయింది. అయినా.. ఇప్పటికీ ఒలింపిక్‌ ఫైనల్‌ చేరిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. కనీసం రజతం ఖాయం చేసుకుని తనదైన గుర్తింపును నిలుపుకుంది.