NTV Telugu Site icon

Haryana Cabinet: సైనీ కేబినెట్‌ విస్తరణ.. ఎంత మందికి చోటు దక్కిందంటే!

Haryana

Haryana

హర్యానాలో ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనీ తన కేబినెట్‌ను విస్తరించారు. మంగళవారం తొలిసారి తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 8 మంది ఎమ్మెల్యేలను మంత్రులుగా తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేయించారు.

గత వారం అనూహ్యంగా హర్యానా ముఖ్యమంత్రి పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన వారసుడిగా నయబ్ సింగ్ సైనీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. సైనీతో పాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. తాజాగా మంగళవారం మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసి కేబినెట్‌లో చేరారు.

కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో హిసార్ బీజేపీ ఎమ్మెల్యే కమల్ గుప్తా, బఢ్‌ఖల్ ఎమ్మెల్యే సీమా త్రిఖ, పానిపట్ రూరల్ ఎమ్మెల్యే మహిపాల్ ధాండ, అంబాలా సిటీ ఎమ్మెల్యే అసీమ్ గోయెల్, నాంగల్ చౌదరి ఎమ్మెల్యే అభె సంగ్ యాదవ్, థానేసర్ ఎమ్మెల్యే సుభాష్ సుధ, బవాని ఖేర ఎమ్మెల్యే బిషాంబర్ సింగ్ బాల్మీకి, సోహ్నా ఎమ్మెల్యే సంజయ్ సింగ్ ఉన్నారు.

ఈ ప్రమణస్వీకారం కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సైతం హాజరయ్యారు. ఇదిలా ఉంటే మనోహర్ లాల్ ఖట్టర్ లోక్‌సభ ఎన్ని్కల్లో పోటీ చేయనున్నారు. కర్నాల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి: Suhas: సుహాస్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్స్ సినిమా.. ఆరోజే రిలీజ్!

త్వరలో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేఫన్ విడుదల చేసింది. ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ ప్రారంభమై.. జూన్ 1న ఏడో విడత పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.