NTV Telugu Site icon

Vinesh Phogat: కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌.. వీడియో వైరల్!

Vinesh Phogat Julana

Vinesh Phogat Julana

Vinesh Phogat Julana Election Results: హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. దాంతో ఫలితాల సరళి క్షణక్షణానికి మారుతోంది. తొలుత కాంగ్రెస్‌ ఆధిక్యంలో జోరు ప్రదర్శించగా.. బీజేపీ క్రమంగా పుంజుకుంది. ప్రస్తుతం 48 స్థానాల్లో బీజేపీ, 34 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. దాంతో హర్యానా పీఠంను వరించేది ఎవరిదనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

హర్యానాలోని జులానా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌.. జింద్‌ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. 4వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి యోగేశ్‌ బైరాగి 3 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి వినేశ్‌ ఆధిక్యంలోనే ఉన్నారు. అయితే 3 రౌండ్ ముగిసేసరికి 2 వేలు, 4వ రౌండ్ పూర్తయ్యేసరికి 3 వేలు వెనుకంజలో ఉన్నారు.

Also Read: Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తులం బంగారం ఎంతంటే?

హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. మ్యాజిక్ ఫిగర్ 46. ప్రస్తుతం బీజేపీ 48 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ ఆధిక్యం 34కి పడిపోయింది. ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇందులో ఐఎన్‌ఎల్‌డీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.