NTV Telugu Site icon

IND vs NZ: ఆస్ట్రేలియా పర్యటనకు ముందే జట్టులోకి యువ ఆటగాడు ఎంట్రీ..

Harshith

Harshith

న్యూజిలాండ్‌తో ముంబైలో జరగనున్న మూడో టెస్టు కోసం ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మంగళవారం (అక్టోబర్ 29) జట్టులోకి రానున్నాడు. సిరీస్ ప్రారంభంలో అతను టీమిండియాలో రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్నాడు. ఆ తర్వాత అస్సాంతో ఢిల్లీ రంజీ ట్రోఫీ మూడో రౌండ్ మ్యాచ్‌లో ఆడేందుకు వెళ్లాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు హర్షిత్ ఎంపికయ్యాడు. అయితే.. ఆస్ట్రేలియాలో ఎంట్రీ ఇస్తాడనుకున్నప్పటికీ, భారత్‌లోనే అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

Read Also: Akshay Kumar: అయోధ్యలోని కోతుల ఆహారం కోసం బాలివుడ్ యాక్టర్ భారీ విరాళం..

భారత క్రికెట్ జట్టు మాజీ సెలెక్టర్, ప్రస్తుత ఢిల్లీ కోచ్ శరణ్‌దీప్ సింగ్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, “హర్షిత్ టెస్ట్ క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. అతను ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు ముంబై టెస్టు ఆడితే బాగుంటుంది.” అని అన్నారు. మరోవైపు.. హర్షిత్ రాణా మాట్లాడుతూ.. “ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు నేను దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరింది. ఈ మ్యాచ్‌లో నేను బ్యాట్, బాల్ రెండింటిలోనూ మంచి ప్రదర్శన కనబరిచినందుకు నేను సంతోషంగా ఉన్నాను” అని అస్సాంపై ఢిల్లీ విజయం తర్వాత రానా చెప్పాడు. గత నెల దులీప్ ట్రోఫీలో రానా రెడ్-బాల్ క్రికెట్‌లో ఆడాడు. అతను ఆడిన రెండు మ్యాచ్‌లలో మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20కి భారత జట్టులోకి ఎంపికయ్యాడు. కానీ.. మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అలాగే.. వైట్ బాల్ క్రికెట్‌కు కూడా సెలక్ట్ అయినప్పటికీ, అరంగేట్రం చేయలేకపోయాడు.

Read Also: Bangalore:12 ఏళ్లు బెంగళూరులో బంగ్లాదేశ్‌ వాసి.. పోలీసులకు పట్టించిన మొదటి భార్య

న్యూజిలాండ్‌తో మూడో టెస్టుకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా.