NTV Telugu Site icon

Harshit Rana – IPL 2024: 2 నేరాలకు రిఫరీ శిక్షలకు గురైన KKR ఆటగాడు.. భారీగా ఫైన్..!

141

141

శనివారం రాత్రి జరిగిన కోల్కత్తా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఉత్కంఠ పోరు సాగింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో విజయం కోల్కత్తా నైట్ రైడర్స్ వైపు నిలిచింది. ఈ మ్యాచ్ లో కోల్కత్తా నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రానా మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్ ను గెలిపించడానికి కారణమయ్యాడు. చివరి ఓవర్లో 6 బంతులకు 13 పరుగులు సన్‌రైజర్స్ జట్టుకు అవసరమవ్వగా దానిని డిపెండ్ చేసి కలకత్తాకు విజయాన్ని అందించాడు.

Also read: Hyper Aadi Marriage: అతని వల్లే నేను సింగిల్ ​గా ఉండిపోయాను.. హైపర్ ఆది కామెంట్స్..!

అయితే ఇదే సమయంలో హర్షిత్ రానా చేసిన రెండు తప్పుల కారణంగా భారీ జరిమానాకు గురయ్యాడు. అతడు ఐపిఎల్ ప్రవర్తన నియమాలని ఉల్లంఘించిన కారణంగా అతని మ్యాచ్లో 60 శాతం జరిమానాలను వేధించారు. ఐపీఎల్ పరివర్తన నియమాలను అనుసరించి ఆర్టికల్ 2.5 ప్రకారం 2 నేరాలకు గాను అతని మ్యాచ్ ఫీజులు 10%, 50% జరిమానా విధించబడింది. ఇలా మొత్తం 60 శాతంగా రెండు నేరాలకు గాను రిఫరీ శిక్షలకు గురిచేశాడు.

Also read:Mudragada: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓటమి కోసం నేను పని చేస్తా..

మ్యాచ్ జరుగుతున్న సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ హేమంత్ అగర్వాల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అవుట్ అయ్యాడు. యామాంక్ అగర్వాల్ ఇచ్చిన క్యాచ్ ను రింకు సింగ్ ఒడిసి పట్టుకోగా.. హర్షిత్ బ్యాటర్ యామాంక్ అగర్వాల్ వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్లుగా సైగ చేశారు. అయితే ఈ చర్యపై బ్యాటర్ యామాంక్ అగర్వాల్ ఏమి మాట్లాడకుండా గ్రౌండ్ నుంచి బయటికి వచ్చాడు. దీంతో ఓ పెద్ద వివాదం జరగలేదని చెప్పవచ్చు. మరోసారి చివరి ఓవర్లలో హెన్రిచ్ క్లాసెన్‌ తో కూడా ఓసారి గొడవపడ్డాడు. దాంతో అతనికి మ్యాచ్ ఫీజులో కోత తప్పలేదు.