Site icon NTV Telugu

Harry Brook: అలా ఎలా పట్టేసావ్ బ్రూక్‌.. ఇంగ్లాండ్ భారీ విజయం..!

Harry Brook

Harry Brook

Harry Brook: నాటింగ్‌హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఇంగ్లాండ్, జింబాబ్వే మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ మూడో రోజు హ్యారీ బ్రూక్‌ అందుకున్న అసాధారణ క్యాచ్‌ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో వెస్లీ మాధెవెరేను ఔట్ చేయడానికి బ్రూక్ పట్టిన ఈ ఒంటిచేతి క్యాచ్, మ్యాచ్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఈ ఘటన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 48వ ఓవర్ లో చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వేసిన షార్ట్ బాల్‌ను మాధెవెరే కట్ చేయబోయి ఎడ్జ్ అయ్యింది. అంతే, బంతి వేగంగా స్లిప్ దిశగా వెళ్లగా.. బ్రూక్ మూడో స్లిప్ దిశలో ఉన్న సమయంలో ఒక్కసారిగా కుడివైపుకు గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని పట్టిన అతడి అద్భుత విన్యాసం అందరిని నోరెళ్లబెట్టేలా చేసింది. ఆ క్యాచ్ తో మాధెవెరే 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌ చేరాడు. ఇక బ్రూక్‌ పట్టిన క్యాచ్ కు స్టోక్స్ ఆశ్చర్యపోయిన రియాక్షన్‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఇకపోతే ఆ ఇన్నింగ్స్‌లో స్టోక్స్‌కు ఇదే ఏకైక వికెట్.

Read Also: Viral Video: పార్టీ ఆఫీస్ లోనే దుకాణం పెట్టిన నేత.. మహిళా కార్యకర్తను ఏకంగా..?

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొని మొదటి ఇన్నింగ్స్‌లో 565 పరుగుల భారీ స్కోరు నమోదు చేసి 96.3 ఓవర్లలో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. జాక్ క్రాలీ (124), బెన్ డకెట్ (140), ఒలీ పోప్ (171) సెంచరీలు చేయడంతో జట్టుకు భారీ స్కోర్ ను అందించారు. ఇక జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 265 పరుగులకు ఆలౌట్ అయింది. ఫాలోఆన్‌లో దిగిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Read Also: IPL: ఐపీఎల్ చరిత్రలో.. సూపర్ ఫాస్ట్ సెంచరీ వీరులు

ఇక ఇంగ్లాండ్‌ తరఫున యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిసి మొత్తం 9 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతను 6 వికెట్లు తీసి జింబాబ్వే పతనానికి కారణమయ్యాడు. ఇక ఈ విజయం అనంతరం కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. ఒక విజయంతో సమ్మర్‌ను ప్రారంభించడం చాలా మంచి విషయం. భారత్‌తో లాంగ్ సిరీస్ ముందు విశ్రాంతి చాలా అవసరం. ఇది మంచి కాన్ఫిడెన్స్ బూస్ట్ అని వ్యాఖ్యానించారు.

Exit mobile version