Harrier EV vs Creta EV: భారత మార్కెట్ లో రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లో వినియోగదారుల ఆసక్తి భారీగా మారుతోంది. ఇందులో టాటా హారియర్ EV (Tata Harrier EV), హ్యుందాయ్ క్రెటా EV (Hyundai Creta EV) మోడళ్లు హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఈ రెండు కూడా తమ తమ బ్రాండ్లకు కీలకమైన ఎలక్ట్రిక్ వాహనాలు. మరి ఈ రెండు కార్లలో ఏది మెరుగైనదో వివిధ సెగ్మెంట్స్ వారీగా చూద్దామా..
డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ:
Harrier EV:
హారియర్ EV స్టైలింగ్ పూర్తిగా మస్క్యులర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. LED DRLs, క్లీన్ ఫ్రంట్ గ్రిల్, స్పోర్టీ బాడీ లైన్స్ తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది ALFA ప్లాట్‌ఫామ్ పై నిర్మించబడినది. EV స్పెసిఫిక్ టచ్‌తో రాబోతుంది.
Creta EV:
క్రెటా EV కూడా కొత్త డిజైన్ ను అనుసరిస్తోంది. ఇందులో ఫ్యూచరిస్టిక్ గ్రిల్, స్లీక్ లైటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఇది ICE వేరియంట్ ఆధారంగా తయారవుతుంది.
మరి ఈ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో హారియర్ EV బలమైన బిల్డ్ క్వాలిటీ ఉండగా, క్రెటా EV స్పెసిఫిక్ డిజైన్ ను కలిగి ఉన్నాయి.
Read Also:HBD Sourav Ganguly: డేరింగ్ కేర్ ఆఫ్ సౌరవ్ గంగూలీ.. టీమిండియా తలరాతనే మార్చిన బెంగాల్ టైగర్..!
బ్యాటరీ కెపాసిటీ, రేంజ్:
Harrier EV లో 60–70 kWh బ్యాటరీ ఉండగా.. 500+ కిమీ రేంజ్ (ఐడీసీ ప్రకారం) వస్తుంది. అదే Creta EV లో 45–50 kWh బ్యాటరీ ఉండగా 350 – 400 కి.మీ. రేంజ్ ఉంది. రెండిటిని చూస్తే.. హారియర్ EV ఎక్కువ రేంజ్ ఇవ్వనుంది.
ఫీచర్లు, ఇంటీరియర్ టెక్నాలజీ:
హారియర్ EV లో 12.3-ఇంచ్ టచ్ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ADAS, 360 డిగ్రీల కెమెరా, వాయిస్ అసిస్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు క్రెటా EV లో ICE వేరియంట్ వలే డిజైన్, 10.25-ఇంచ్ టచ్ స్క్రీన్, Hyundai BlueLink కనెక్టివిటీ, ADAS లైట్ వెర్షన్ లు ఉన్నాయి. మొత్తంగా ఈ రెండిటిని పోల్చితే.. హారియర్ EV లో ఎక్కువగా లేటెస్ట్ ఫీచర్లను ఇస్తుంది.
పెర్ఫార్మన్స్:
హారియర్ EV లో AWD లైక్లీ, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు, టార్క్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదే క్రెటా EV లో కూడా FWD కామ్ డైనమిక్స్, సిటీలకు అనువైన డైలీ డ్రైవింగ్ ఫీల్ ఇవ్వనుంది. మొత్తంగా హారియర్ EV డ్రైవింగ్ ఎంగేజ్‌మెంట్ అండ్ అధిక శక్తి సామర్థ్యం అందించనుంది.
Read Also:Father Abuse on Daughters: తండ్రి కాదు కామ పిశాచి.. ఐదుగురు కూతుర్లపై అత్యాచారం.. వీడియో వైరల్..!
ధర:
హారియర్ EV రూ. 28–32 లక్షల మధ్య (ఎక్స్‌షోరూం) ఉండి ప్రీమియం కస్టమర్లకు అనువైనదిగా ఉంది. అలాగే క్రెటా EV కూడా రూ. 22–25 లక్షల మధ్య ఉండి మధ్యతరగతి కస్టమర్లను టార్గెట్ చేస్తుంది. మొత్తంగా క్రెటా ఈవ్ తక్కువ ధరలో మంచి కారును పొందవచ్చు.
ఇక మొత్తంగా చూస్తే.. మీకు పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, ఎక్కువ రేంజ్, ఫీచర్-రిచ్ SUV కావాలంటే టాటా హారియర్ EV ఉత్తమ ఎంపికగా ఉంటుంది. అదే మీరు కాంపాక్ట్, బడ్జెట్ ఫ్రెండ్లీ, డైలీ వాడకానికి అనువైన ఎలక్ట్రిక్ SUV కోరుకుంటే హ్యుందాయ్ క్రెటా EV సరైన ఎంపిక. హారియర్ EV ప్రీమియం, పవర్, టెక్నాలజీతో నిండిన EV కాగా.. క్రెటా EV సాధారణ డ్రైవింగ్ అవసరాల కోసం సమతుల్యమైన ఎలక్ట్రిక్ SUV. కాబట్టి మీ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవడమే ఉత్తమం.
