Site icon NTV Telugu

Harom Hara : మోస్ట్ వైలెంట్ విలన్స్ ను పరిచయం చేసిన మేకర్స్..

Whatsapp Image 2023 11 25 At 3.33.18 Pm

Whatsapp Image 2023 11 25 At 3.33.18 Pm

టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. కానీ ఈ హీరో కి అదృష్టం మాత్రం కలిసి రావడంలేదు.ఈ ఏడాది మొదట్లో సుధీర్ బాబు ‘హంట్’ అనే సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఈ మూవీ తర్వాత ‘మామా మశ్చింద్ర’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయగా ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. మామా మశ్చింద్ర సినిమా కోసం మూడు డిఫరెంట్ రోల్స్‌లో వైవిధ్యభరితంగా కనిపించడానికి సుధీర్ బాబు ఎంతగానో కష్టపడినా సినిమా బోరింగ్‌ గా ఉందంటూ నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇక ప్రస్తుతం సుధీర్‌బాబు ఆశలన్నీ తాను చేస్తున్న తాజా చిత్రంపైనే. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘హరోంహర’..’ది రివోల్ట్‌’ అనేది ఉపశీర్షిక.

ఈ సినిమాకు జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు.సుమంత్‌ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి విలన్ పాత్రలు పోషిస్తున్న వారి ఫస్ట్ లుక్‌లను మేకర్స్ విడుదల చేశారు. కన్నడ నటుడు రవి కాలే ఈ సినిమాలో బసవ రెడ్డి పాత్రలో నటించబోతుండగా.. కేజీఎఫ్ ఫేమ్ లక్కీ లక్ష్మణ్ తమ్మి రెడ్డి పాత్రలో అలాగే అర్జున్ గోవిందా శరత్ రెడ్డి పాత్రలో నటించనున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా తెలిపింది.1989 నాటికాలం చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఇక ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 27న మేకర్స్‌ విడుదల చేయనున్నారు.ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుస్తుంది. అలాగే ఈ చిత్రంలో సునీల్‌, అక్షర కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి చేతన్‌ భరద్వాజ్‌ మ్యూజిక్ అందిస్తున్నారు…

Exit mobile version