Harom Hara : మోస్ట్ వైలెంట్ విలన్స్ ను పరిచయం చేసిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. కానీ ఈ హీరో కి అదృష్టం మాత్రం కలిసి రావడంలేదు.ఈ ఏడాది మొదట్లో సుధీర్ బాబు ‘హంట్’ అనే సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఈ మూవీ తర్వాత ‘మామా మశ్చింద్ర’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయగా ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. మామా మశ్చింద్ర సినిమా కోసం మూడు డిఫరెంట్ రోల్స్‌లో వైవిధ్యభరితంగా కనిపించడానికి సుధీర్ బాబు ఎంతగానో కష్టపడినా సినిమా బోరింగ్ గా ఉందంటూ నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇక ప్రస్తుతం సుధీర్‌బాబు ఆశలన్నీ తాను చేస్తున్న తాజా చిత్రంపైనే. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘హరోంహర’..’ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక.
ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు.సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి విలన్ పాత్రలు పోషిస్తున్న వారి ఫస్ట్ లుక్‌లను మేకర్స్ విడుదల చేశారు. కన్నడ నటుడు రవి కాలే ఈ సినిమాలో బసవ రెడ్డి పాత్రలో నటించబోతుండగా.. కేజీఎఫ్ ఫేమ్ లక్కీ లక్ష్మణ్ తమ్మి రెడ్డి పాత్రలో అలాగే అర్జున్ గోవిందా శరత్ రెడ్డి పాత్రలో నటించనున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా తెలిపింది.1989 నాటికాలం చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఇక ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 27న మేకర్స్ విడుదల చేయనున్నారు.ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుస్తుంది. అలాగే ఈ చిత్రంలో సునీల్, అక్షర కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు…
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!