భారత మహిళా క్రికెట్ జట్టు సారథి హర్మన్ ప్రీత్ కౌర్ కొత్త లుక్ తో అదరగొట్టింది. ఎప్పుడూ స్పోర్ట్స్ డ్రెస్ లో కనిపించే ఈ అమ్మడు.. కొత్తగా చీరకట్టులో కనిపించి అభిమానుల ప్యూజులు ఎగరగొట్టింది. భారతీయత ఉట్టిపడేలా చీరకట్టులో తళుక్కుమన్న హర్మన్ ను చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఈ ఫోటోను హర్మన్ స్వయంగా తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయగా నెటిజన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది.
Read Also : AP CM Jagan: స్కామ్‌లు తప్ప.. స్కీమ్‌లు తెలియవు.. ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్
కొందరు హర్మన్ ఫోటోను చూసి అచ్చం మళయాళ కుట్టిలా ఉందని అంటుంటే మరికొందరేమో బెంగాళీ భామ అని ఇంకొందరు అచ్చం తెలుగమ్మాలా కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్.. లైక్స్ రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also : Care Hospital: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడిని సత్కరించిన కేర్ ఆస్పత్రి..
ఇదిలా ఉంటే ఇటీవలే ముగిసిన మహిళల ఐపీఎల్ లో అరంగ్రేటం సీజన్ లో హర్మన్ నేతృత్వంలో ముంబై ఇండియన్స్ మహిళల జట్టు ఛాంపియన్ గా అవతరించింది. ఫైనల్లో.. ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ జట్టుపై 7 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ దక్కించుకుంది. లీగ్ ప్రారంభం నుంచే హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన హర్మన్ సేన.. ఎలిమినేటర్ లో యూపీ వారియర్జ్ ను మట్టికరిపించి.. తుది పోరుకు అర్హత సాధించింది.
Read Also : Bandi sanjay: బండి సంజయ్ పిటిషన్ విచారణ ఈనెల 10 కి వాయిదా
ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ హేలీ మాథ్యూస్, అద్భతు ప్రదర్శన ధాటికి నిర్ణీత ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి.. 131 పరుగులు చేసింది. లక్ష్య ఛైధనలో నాట్ సీవర్ బ్రంట్, హర్మన్ రాణించడంతో 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. లీగ్ లో రాణించిన హర్మన్.. సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆరంభ ఎడిషన లో మొత్తం 10 మ్యాచ్ లు ఆడిన హర్మన్ 40.41సగటున.. 135 స్ట్రయిక్ రేట్ తో 281 పరుగులు చేసింది. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.