NTV Telugu Site icon

WPL 2025: మెరిసిన హర్మన్‌ప్రీత్‌.. గుజరాత్‌పై ముంబై విజయం!

Mi Vs Gg

Mi Vs Gg

డబ్ల్యూపీఎల్‌ 2025లో భాగంగా సోమవారం రాత్రి బ్రబోర్న్ స్టేడియంలో గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 180 పరుగుల ఛేదనలో గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. భార్తీ ఫుల్మాలీ (61; 25 బంతుల్లో 8×4, 4×6) హాఫ్ సెంచరీ చేయగా.. హర్లీన్‌ డియోల్‌ (24), లిచ్‌ఫీల్డ్‌ (22) పరుగులు చేశారు. ముంబై బౌలర్లు హేలీ, అమేలియా కెర్‌ చెరో మూడు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌కు ముందే ముంబై, గుజరాత్‌ టీమ్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (54; 33 బంతుల్లో 9×4) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. నాట్‌సీవర్‌ (38; 31 బంతుల్లో 6×4), అమన్‌జ్యోత్‌ కౌర్‌ (27; 15 బంతుల్లో 3×4, 1×6)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు భారీ స్కోరు అందించింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్‌ (27; 22 బంతుల్లో 3×4, 2×6) కూడా ఆకట్టుకుంది. చివరి 5 ఓవర్లలో ముంబై 62 పరుగులు చేసింది. ఛేదనలో గుజరాత్‌ తడబడింది. 11 ఓవర్లలో స్కోరు 70/5గా ఉండడంతో గుజరాత్‌ పనైపోయినట్లే అనుకున్నారంతా. కానీ ఈ సమయంలో భార్తీ ఫుల్మాలీ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. హేలీ 3 వికెట్లు తీసి మూడే పరుగులు ఇవ్వడంతో గుజరాత్‌ ఓటమి పాలైంది.