WPL 2025: మెరిసిన హర్మన్‌ప్రీత్.. గుజరాత్‌పై ముంబై విజయం!
- గుజరాత్‌పై ముంబై విజయం
- హాఫ్ సెంచరీతో మెరిసిన హర్మన్‌ప్రీత్
- భార్తీ ఫుల్మాలీ అద్భుత ఇన్నింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్ల్యూపీఎల్ 2025లో భాగంగా సోమవారం రాత్రి బ్రబోర్న్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 180 పరుగుల ఛేదనలో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. భార్తీ ఫుల్మాలీ (61; 25 బంతుల్లో 8×4, 4×6) హాఫ్ సెంచరీ చేయగా.. హర్లీన్ డియోల్ (24), లిచ్‌ఫీల్డ్ (22) పరుగులు చేశారు. ముంబై బౌలర్లు హేలీ, అమేలియా కెర్ చెరో మూడు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌కు ముందే ముంబై, గుజరాత్ టీమ్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (54; 33 బంతుల్లో 9×4) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. నాట్‌సీవర్ (38; 31 బంతుల్లో 6×4), అమన్‌జ్యోత్ కౌర్ (27; 15 బంతుల్లో 3×4, 1×6)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు భారీ స్కోరు అందించింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ (27; 22 బంతుల్లో 3×4, 2×6) కూడా ఆకట్టుకుంది. చివరి 5 ఓవర్లలో ముంబై 62 పరుగులు చేసింది. ఛేదనలో గుజరాత్ తడబడింది. 11 ఓవర్లలో స్కోరు 70/5గా ఉండడంతో గుజరాత్ పనైపోయినట్లే అనుకున్నారంతా. కానీ ఈ సమయంలో భార్తీ ఫుల్మాలీ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. హేలీ 3 వికెట్లు తీసి మూడే పరుగులు ఇవ్వడంతో గుజరాత్ ఓటమి పాలైంది.
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!