PM Modi: మహిళల ప్రపంచ కప్ 2025 గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. న్యూఢిల్లీ లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో మోడీ ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులతో ప్రధాని ముచ్చటించారు. ప్రపంచ కప్ విజయం సాధించినందుకు ప్రధాని జట్టును అభినందించారు. ముఖ్యంగా మూడు వరుస ఓటముల తర్వాత టోర్నమెంట్‌లో జట్టు అద్భుతమైన కం బ్యాక్ ఇవ్వడం, అలాగే సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోలింగ్‌ను అధిగమించడంపై ప్రశంసించారు. అయితే.. భేటీలో ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. క్రికెటర్ హర్లీన్ కౌర్ డియోల్ మోడీని ఓ ప్రశ్న అడిగింది. ఈ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
READ MORE: Colourful Snake: రంగురంగులుగా, అందంగా కనిపించే పాము.. దగ్గరికెళ్లారో డేంజరే..
తన రహస్య చర్మ సంరక్షణ దినచర్య గురించి ప్రధాని మోడీని హర్లీన్ కౌర్ డియోల్ ప్రశ్నించింది. “మీరు చాలా మెరుస్తారు సార్?” ఇంత యవ్వనంగా కనిపించే మీ చర్మ సౌందర్యం వెనుక సీక్రెట్ ఏంటి? అని అడిగింది. ఈ ప్రశ్నతో క్రికెటర్లంతా చిరునవ్వులు చిందించారు. ప్రధాని సైతం చిరునవ్వుతో సమాధానమిచ్చారు. చర్మ సంరక్షణ లేదా వస్త్రధారణపై తాను ఎప్పుడూ పెద్దగా శ్రద్ధ చూపలేదని చెప్పారు. “ప్రత్యేకంగా ఏమీ చేయను. దాదాపు పాతికేళ్లుగా ప్రభుత్వ పాలనలో మునిగి ఉన్నా, ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలే శాశ్వత ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతా.” అని ప్రధాని సమాధానమిచ్చారు. దీంతో అక్కడున్న క్రికెటర్లంతా చెప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
READ MORE: Colourful Snake: రంగురంగులుగా, అందంగా కనిపించే పాము.. దగ్గరికెళ్లారో డేంజరే..
