సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. సంగారెడ్డి కలెక్టరేట్‌లో జీవో 59 కింద లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు మంత్రి హరీష్‌రావు. జిల్లా కలెక్టర్ శరత్‌కు ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను మంత్రి హరీష్ రావు అందజేశారు. ఈ క్రమంలోనే.. కలెక్టరేట్ ఆవరణలో హరిత హారం కింద నాటిన చెట్లను పరిశీలించారు హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి హరీష్‌రావు.. జాతీయ రహదారిపై మురికినీరు ప్రవహించడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read : NTR 30: శ్రీదేవి కూతురితో ఎన్టీవోడి మనవడు…
వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కొందరు ఓట్ల కోసం రాజకీయాలు చేస్తారన్నారు. హరిత హారం భవిష్యత్ తరాల కోసం సీఎం కేసీఆర్ ఆలోచన అని ఆయన వెల్లడించారు. 270 కోట్ల మొక్కలు నాటడం హరిత హారం లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Bhadradri Temple : భద్రాద్రి ఆలయంలో సిబ్బంది నిర్లక్ష్యం.. ఇద్దరు అర్చకులకు మెమోలు
తెలంగాణ తప్పా దేశంలో ఎక్కడా ఊరు ఊరికి నర్సరీలు లేవన్నారు. పర్యావరణం దెబ్బతిని ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని, పర్యావరణాన్ని మెరుగుపర్చేందుకు హరితహారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏడు శాతం గ్రీన్ కవర్ పెరిగిందని కేంద్రమే చెప్పిందని, తెలంగాణా తరహాలో రైతు పథకాలు ప్రారంభించాలని ఇతర రాష్ట్రాల రైతులు కోరుతున్నారన్నారు. తెలంగాణా ఓ మోడల్ అని ఆయన వ్యాఖ్యానించారు.
