Site icon NTV Telugu

Harish Rao: సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం..!

Harish Rao Vs Revanth Reddy

Harish Rao Vs Revanth Reddy

Harish Rao: సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. సిగాచి బాధితులకు ఇచ్చిన కోటి పరిహారం హామీ ఏమైంది? ఇచ్చింది 26 లక్షలే.. ప్రభుత్వం బాకీ పడింది 74 లక్షలు.. ఇది ముఖ్యమంత్రి మాట తప్పడం కాదా? అని ప్రశ్నించారు. కార్మికులకు రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ డబ్బులను కూడా ప్రభుత్వం ఇప్పించే నష్టపరిహారంలో చూపించడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నిస్సిగ్గుగా “బాధితులకు రూ. 40 నుంచి 50 లక్షలు అందించాం” అని ప్రకటించడం అత్యంత శోచనీయమన్నారు. చికిత్స ఖర్చులను పరిహారంలో కోత విధించడం అమానవీయమన్నారు. ఆచూకీ దొరకని 8 మందికి డెత్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం దుర్మార్గమని తీవ్ర విమర్శలు చేశారు. “సిగాచి యాజమాన్యానికి అధికారులు ఏజెంట్లుగా మారారు. బాధితులను చీదరించుకోవడం దారుణం. కేంద్రం ప్రకటించిన రూ. 2 లక్షలు ఇప్పించే సోయి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? హైకోర్టు మొట్టికాయలు వేసినా యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు? తక్షణమే కోటి పరిహారం చెల్లించాలి.. లేదంటే బీఆర్ఎస్ పక్షాన ఉద్యమిస్తాం.. పరిహారం కోసం బాధితుల చెప్పులు అరిగేలా తిరుగుతున్నా .. పాలకుల మనసు కరగడం లేదు. సిట్ (SIT) వేయరు.. అరెస్టులు చేయరు.. నిస్సిగ్గుగా సిగాచి యాజమాన్యాన్ని కాపాడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.” అని హరీష్‌రావు లేఖలో పేర్కొన్నారు.

READ MORE: CM Revanth Reddy: దేశమంతా సన్నబియ్యం పంపిణీ చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్‌రెడ్డి సూచన..

Exit mobile version