Site icon NTV Telugu

Harish Rao : పదో తరగతి విద్యార్థులను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి

Harish Rao

Harish Rao

సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలలోని పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్‌ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలలు, పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి సారించి, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచి వారిని ప్రోత్సహించాలని మంత్రి హరీష్ రావు సూచించారు. 10/10 మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.10 వేలు, 100 శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలకు రూ.25 వేలు అందజేస్తామని, ప్రతి వారం విద్యార్థుల తల్లిదండ్రులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తానని హామీ ఇచ్చారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో ప్రధానోపాధ్యాయుల సమావేశాన్ని మంత్రి హరీష్ రావు ఏర్పాటు చేశారు. 10వ తరగతి ఫలితాలు 100 శాతం వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Also Read : Naga Babu: విమర్శలు చేయడం తప్ప.. ఏపీ మంత్రులకు ఏ పని లేదు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ఐదో స్థానంలో నిలిచిందని ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి హరీష్ రావు. గతేడాది ప్రథమ స్థానం సాధించామని, ఈ ఏడాది కూడా ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో సిద్దిపేట ప్రథమ స్థానంలో నిలిచేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు పంపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రజాప్రతినిధులు, యువత బాధ్యత తీసుకోవాలని సూచించారు. పిల్లలు మొబైల్ ఫోన్ల పట్ల ఆకర్షితులవుతున్నారని హరీశ్ రావు మాట్లాడుతూ.. పరికరాలను వారి దరిచేరకుండా తల్లిదండ్రులు ఉంచాలని మంత్రి హరీష్ రావు సూచించారు.

Also Read : Stock Market Update (11-01-2023) : రెడ్, గ్రీన్ మధ్య.. ఊగిసలాట..

Exit mobile version