NTV Telugu Site icon

Harish Rao: రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పచ్చి అబద్ధాలు చెపుతున్నారు

Harish Rao11

Harish Rao11

ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ రోడ్ షోలో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. ‘బీఆర్ఎస్ సభలల్లో జన సునామీ కనిపిస్తుంది. కాంగ్రెస్ వాళ్ల మీటింగ్‌లకు మాత్రం జనాలు రావడం లేదు. 80 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు అన్నదాతలకు కష్టాలు. రేవంత్ 3 గంటలు కరంట్ చాలు అంటున్నాడు. కర్ణాటక DY సీఎం శివ కుమార్ 5 గంటలు కరంట్ ఇస్తాం అని కుండ బద్దలు కొట్టాడు.

Also Read: Teen Queer Pranshu: ఇన్‌స్టా రీల్స్‌కి బ్యాడ్ కామెంట్స్.. 16 ఏళ్ల క్వీర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య

రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు వచ్చి పచ్చి అబద్ధాలు చెపుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణా కుక్కలు చింపిన విస్తారకు అవుతుంది. అన్నదాతలు అంటే కేసీఆర్‌కు ప్రాణం. రైతు బంధు ఇవ్వండి అని హైకోర్టు చెప్పింది.. న్యాయం గెలిచింది. కాంగ్రెస్ వాళ్లకు చెంపపెట్టులాగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. మరో మూడు రాజుల్లో అన్నదాతల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ ఐతాయి. రైతుకు ఎన్ని ఏకరాలున్న 15 వేలు మాత్రమే ఇస్తారట. ఆ కుట్రను అన్నదాతలు గమనించాలి’ అని హరీష్ రావు పేర్కొన్నారు.

Also Read: Barrelakka -RGV : పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క బెటర్

అలాగే యాదాద్రి జిల్లా భువనగిరిలో కూడా ప్రచారం నిర్వహించిన హరీష్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘భువనగిరి లో ఎగిరేది గులాబీ జెండానే. మంగళవారం నుండి రైతు బంధు డబ్బులు అన్నదాతలు ఖాతాల్లో జమ అవుతాయి. కాంగ్రెస్ వాళ్లు అభివృద్ధి నిరోధకులు. కరెంట్ కావాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటయ్యాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కటిక చికటే. కేసీఆర్‌తోనే 24 గంటల కరెంట్ వస్తుంది. కాంగ్రెస్‌కు ఓటేస్తే రిస్క్‌లో పడతాం. కాంగ్రెస్ వాళ్లు ఢిల్లీకి గులాంలు. కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలే హైకమాండ్’ అన్నారు.