చిన్నకోడూరు (మం) గోనేపల్లి, రాముని పట్ల, ఇబ్రహీంనగర్ లో వడగళ్ల వానతో పంట నష్టం జరిగిన పొలాలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ.. రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తున్నాను ఏ ఊర్లో పూర్తి రుణమాఫీ జరిగిందో చెప్పండి.. గన్మెన్లు లేకుండా, పోలీసులు లేకుండా ఏ ఊరికి వెళ్దామో రండి రుణమాఫీ ఎక్కడ జరిగిందో చూద్దాం.. పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీపక్షాన తీవ్ర సంతాపాన్ని తెలుపుతున్నాను..
Also Read:CSK Playoffs Chances: వరుసగా ఐదు ఓటములు.. సీఎస్‌కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ ఇలా!
వనజీవి రామయ్య మరణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు.. చెట్లు నరకడం రేవంత్ రెడ్డి వంతు, చెట్లు పెట్టడం రామయ్య గారి వంతు.. చెట్లు నరికే రేవంత్ రెడ్డి చెట్లు పెట్టే రామయ్యకు సంతాపం చెప్పడం అంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుంది.. హార్టికల్చర్ యూనివర్సిటీలో చాలా ఎకరాల్లో చెట్లని నరికేశాడు. HCU లో 400 ఎకరాల్లో చెట్లను నరికాడు.. ఈరోజు అధికారులు వాళ్ళ ఉద్యోగాలు పోయి జైల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది.. రేవంత్ రెడ్డి తప్పుడు పనుల వల్ల అధికారులు బలయ్యే పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు.