NTV Telugu Site icon

Harish Rao : ఆత్మస్తుతి.. పర నిందలా.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్

Harish Rao

Harish Rao

ఆత్మ స్తుతి పర నింద లా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆరు గ్యారంటీ లు నీరు గారిపోయాయని, అంకెల గారడీల రాష్ట్ర బడ్జెట్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఓట్ల ముందు గ్యారంటీలా గారడి అని, రాష్ట్రాన్ని తిరోగమన దిశలో బడ్జెట్ ఉందన్నారు హరీష్‌ రావు. ఇచ్చిన హామీల ప్రస్తావన ఏ ఒక్కటి లేదని, అప్పులు తెస్తామని మళ్ళీ చెప్తుందన్నారు హరీష్‌ రావు. కాంగ్రెస్ తన మేనిఫెస్టో మర్చిపోయిందని, 2,500 మహిళలకు ఇస్తామని చెప్పిందన్నారు హరీష్‌ రావు. కోటి మంది అక్క చెల్లెళ్ళు ఎదురు చూస్తున్నారని, 8నెలలుగా మహాలక్ష్మి కాస్త మహా నిరాశ గా మారిందన్నారు. ఆసరా పెన్షన్ పై యెన్నో చెప్పారు రేవంత్ రెడ్డి అని, 4వేల పెన్షన్ లు ఇప్పటిదాక ఇవ్వలేదన్నారు.

Ponnam Prabhakar : ముంపు గ్రామాల సమస్య ఎందుకు పరిష్కరించలేదో చెప్పి రావాలి
ఊదర గొట్టి బడ్జెట్ లో పెట్టలేదని, పేదల ప్రభుత్వం అన్న కాంగ్రెస్ ఎందుకు ఇవ్వటం లేదన్నారు హరీష్‌ రావు. కొత్త రేషన్ కార్డు ఎప్పటీ నుండి ఇస్తారో చెప్పలేదు. జ్యాబ్ క్యాలెండర్ ప్రస్థావన లేదని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని మేం నిర్లక్ష్యం చేశామన్నారు. కానీ హైదరాబాద్ అభివృద్ధిని బీఆర్ఎస్ కొనసాగించిందని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్‌ను సూపర్ స్టార్ రజనీ కాంత్ పొగిడారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి రజనీకి కనిపించింది కానీ కాంగ్రెస్ గజినీలకు కనిపించలేదు అని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన కారణంగానే తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందన్నారు.

Vishnu Kumar Raju: 95 శాతం ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు.. అక్రమ కేసులపై హోంమంత్రి సమీక్ష చేయాలి..