Site icon NTV Telugu

Harish Rao: తెలంగాణ హైకోర్టులో హరీష్‌రావు హౌస్‌మోషన్‌ పిటిషన్‌.. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దంటూ..

Harish Rao

Harish Rao

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదిక హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేపు సభలో కాళేశ్వరం నివేదిక పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో హరీష్‌రావు హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టొద్దని హరీష్‌రావు పిటిషన్‌ వేశారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆదేశాలివ్వాలని హరీష్‌రావు కోర్టుకు విన్నవించారు.ా

Also Read:Heart Attack: డ్యూటీలో ఉండగా గుండెపోటు.. కార్డియాక్‌ సర్జన్‌ మృతి..

అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చిట్ చాట్ లో మాట్లాడుతూ.. మేము కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఈ ప్రభుత్వానికి భయం ఎందుకు అని ప్రశ్నించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వడం లేదంటేనే ఈ ప్రభుత్వం భయపడుతున్నట్లు అర్ధం అవుతుంది.. వాస్తవాలు ప్రజలకు వివరిస్తాం కదా.. వాస్తవాలు వినడానికి కాంగ్రెస్ పార్టీ గాని, శ్రీధర్ బాబు గానీ ఇష్టంగా లేరు.. నిజాలు తేల్చాల్సింది కోర్టులు మాత్రమే అని తెలిపారు.

Exit mobile version