Site icon NTV Telugu

Harish Rao : నా ఊపిరి ఉన్నంతవరకు సిద్దిపేట అభివృద్ధి కోసం కృషి చేస్తా

Harish Rao

Harish Rao

సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు. తెలంగాణలో అత్యధిక CMRF చెక్కులు అందినటువంటి నియోజకవర్గం సిద్దిపేట అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆశీర్వాదంతో రాష్ట్రంలోనే బెస్ట్ నియోజకవర్గంగా సిద్దిపేట తీర్చిదిద్దుకున్నామని, సిద్దిపేటలో సగం నిర్మాణం పూర్తయిన వెటర్నరీ కాలేజీని కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్‌కు తరలించుకుపోయిందన్నారు హరీష్‌ రావు. కొడంగల్‌కు అవసరమైతే కొత్త కాలేజీని నిర్మించుకోవాలి గాని సిద్దిపేటకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసం అని, 150 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వెటర్నరీ కాలేజీని గద్దలా తన్నుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి తీరును ప్రజలు గమనించాలన్నారు. అసెంబ్లీలో కొట్లాడి సిద్దిపేటకు రావాల్సిన పనులను హక్కుగా తీసుకొని వస్తా అని, నా ఊపిరి ఉన్నంతవరకు సిద్దిపేట అభివృద్ధి కోసం కృషి చేస్తా అని ఆయన అన్నారు.

Kolkata Doctor Murder Case : వైద్యురాలిపై హత్యాచార ఘటన.. నిందితుల పాలిగ్రాఫ్‌ రిపోర్టు వచ్చింది.. కానీ..

‘హైడ్రా’ పేరుతో రాష్ట్రంలో హైడ్రామా నడుస్తున్నదని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఇంబ్బంది పెట్టాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇచ్చిన తర్వాత తప్పుంటే కూలగొట్టాలన్నారు. రాజకీయంగా పల్లాను ఎదుర్కోలేక ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో పల్లా భూములు లేవని ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖలు నివేదికలు ఇచ్చాయని, జిల్లా కలెక్టర్‌ కూడా ఎన్‌వోసీ జారీచేశారన్నారు. హెచ్‌ఎండీఏ అనుమతితోనే కాలేజీ నిర్మాణం చేశారని, రికార్డులు పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజకీయ ప్రేరిత విషయాల్లో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని సూచించారు.. విద్యా సంస్థలు, దవాఖానలపై రాజకీయ కక్షలు ఎందుకని ప్రశ్నించారు.

UPS: యుపీఎస్ పథకాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రం.. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పండగే!

Exit mobile version