Site icon NTV Telugu

Harish Rao: కేసీఆర్ ఆరోగ్యంపై మాజీ మంత్రి హరీష్‌రావు కీలక ప్రకటన..

Kcr, Harish Rao

Kcr, Harish Rao

Harish Rao: తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధంకండి.. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం అందరం ఒక్కటై మరో పోరాటానికి సిద్ధం కావల్సిన పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన విజయ దీక్షా దివస్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. కేసీఆర్ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడన్నారు. పాలు ఏందో నీళ్లు ఏందో ప్రజలకు అర్థమైంది.. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. కేసీఆర్ దీక్ష లేకపోతే తెలంగాణ ప్రకటన రాకపోయేదని తెలిపారు. కొందరు కాంగ్రెస్ నాయకులు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులు చరిత్ర రాస్తే.. రేవంత్ రెడ్డి చరిత్రనే రాయాల్సి వస్తుందని విమర్శించారు.. రేవంత్ రెడ్డి అంటే ద్రోహి, రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు..

READ MORE: Google AI Glasses: డిస్ప్లే, వాయిస్ సపోర్ట్ తో.. రెండు AI గ్లాసెస్ ను విడుదల చేయనున్న గూగుల్

రెండేళ్ల నుంచి తెలంగాణ అస్తిత్వాన్ని రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారు.. రామోజీరావు కంటే గొప్ప అవార్డు లేదని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి.. రవీంద్రభారతిలో ఇచ్చే కాళోజీ, దాశరథి, గద్దర్ అవార్డులను అవమానిస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. “టారిఫ్ లతో భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. సోనియా గాంధీని బలిదేవత అని మాట్లాడిన రేవంత్ రెడ్డి. ఈరోజు సోనియాగాంధీ దేవత అంటున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆనాడు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే.. సమైక్య పాలకులు యాదిరెడ్డి శవాన్ని ఏపీ భవన్ కు రానివ్వలేదు.. ఢిల్లీ పోలీసులు మా మీద కేసులు పెడితే కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ తిరగాల్సి వచ్చింది.. త్యాగం అంటే కేసీఆర్ ది.. పదవులను గడ్డి పూసల వదిలేసిన వ్యక్తి కేసీఆర్.. నిమ్స్ ఆస్పత్రిలో ప్రాణం మీదికి వచ్చిన దీక్ష విరమించని వ్యక్తి కేసీఆర్.. తెలంగాణ జైత్రయాత్రను కేసీఆర్ శవ యాత్రను అని నినదించినప్పుడు, నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.. తెలంగాణ చరిత్ర అంటే కేసీఆర్ ది. మనమందరం మరో పోరాటానికి సిద్ధం కావలి..” అని ప్రసంగించారు.

READ MORE: Benefits of Barley Water: డయాబెటిస్ నివారణకు బార్లీ ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసా..

Exit mobile version