NTV Telugu Site icon

Harirama Jogaiah: మంత్రి నిమ్మలకు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ

Harirama Jogaiah

Harirama Jogaiah

Harirama Jogaiah: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజవర్గంలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలంటూ మంత్రి నిమ్మల రామానాయుడుకి, ఎంపీ శ్రీనివాస్ వర్మకు మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షులు హరి రామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. అభివృద్ధి అంటే రాజ్య సాధనాలు, పరిపాలన భవనాలు, నివాస భవనాలు, పార్కులు, కళాభవనాలు ,విశ్రాంతిభవనాలు, నిర్మించడానికి ప్రాధాన్యత కాదని.. రోడ్లు నిర్మాణం, సాగునీరు, మురుగు కాలువల నిర్మాణం, స్వచ్ఛమైన త్రాగునీరు విద్య, ఆరోగ్య పరిరక్షణతో పాటు వైద్య సౌకర్యం కల్పించడంలో అతి ముఖ్యమైనవని.. ఈ రకమైన చర్యలు చేపట్టడమే నిజమైన అభివృద్ధి అని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యత వేరుగా ఉందని హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు.

Read Also: Andhra Pradesh: ఓ నేత పుట్టిన రోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలు.. వీడియోలు వైరల్‌

నివాస పరిపాలన, రాజ్య భవనాల పేరుతో కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు చేయడానికి పూనుకోవడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే ప్రాధాన్యతగా కనబడుతుందన్నారు. అభివృద్ధి అంతా కేంద్రీకరిస్తూ ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఇది నిజమైన రాష్ట్ర అభివృద్ధి అనిపించుకోదన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అదే ప్రభుత్వ లక్ష్యం కావాలి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, ఆచంట భీమవరం, తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజవర్గానికి సమాన దూరంలో ఉన్న పాలకొల్లు నియోజవర్గంలో ఆధునిక వైద్య సదుపాయాలు గల ఆస్పత్రిని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైనా చిన్నా పెద్దా వైద్య అవసరం వస్తే అటు హైదరాబాద్.. ఇటు విశాఖపట్నం వెళ్లాల్సిన అవసరం వస్తుందని.. అటువంటి అవస్థల నుండి బయటపడటానికి ప్రతి జిల్లాకి ఆరోగ్యశ్రీ కలిగిన సూపర్ స్పెషాలిటీ ఆస్పటల్ నిర్మించాల్సిన ప్రాధాన్యత ఎంతైనా ఉందన్నారు.
ఇప్పటికే పాలకొల్లు పట్టణంలో వంద పడకల ఆసుపత్రి సాంక్షన్ కాబడి నిర్మాణ దశలో ఉందన్నారు. అలాగే మెడికల్ కాలేజీ సాంక్షన్ కాబడి నిర్మాణ దశలో ఉందన్నారు. అలాగే ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన 13 1/2 ఎకరాల స్థలం కూడా అందుబాటులో ఉందన్నారు. ఆధునిక వైద్యం అందుబాటులోకి తీసుకురావటంలో భాగంగా తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలకు మధ్యస్థమంగా ఉన్న పాలకొల్లు నియోజకవర్గంలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ స్థాపించడం చాలా అవసరం ఉందన్నారు. దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మంత్రి నిమ్మల, ఎంపీ శ్రీనివాస్‌ వర్మను, ప్రజల తరుపున కోరుతున్నట్లు జోగయ్య తన లేఖ ద్వారా తెలియజేశారు.

Show comments