NTV Telugu Site icon

Hari ramajogaiah: మంత్రి అమర్నాథ్ కు హరిరామజోగయ్య లేఖ

Harirana 1

Harirana 1

ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇతర పార్టీ నేతలపై విమర్శల దాడి పెంచేశారు. గుడివాడ అమర్నాథ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాపు ఉద్యమనేత చేగొండి హరిరామజోగయ్య. మంత్రి అమర్నాథ్ కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది. నువ్వు రాజకీయాల్లో బచ్చావి, పైకి రావాల్సిన వాడివి. సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తు నాశనం చేయకు..అనవసరంగా పవన్ కళ్యాణ్ పై బురద చల్లే ప్రయత్నం చేయకు..నీ మంచి కోరి చెబుతున్న అని లేఖలో పేర్కొన్నారు హరిరామజోగయ్య.

నిన్న పవన్ కళ్యాణ్ పై ఐటి మంత్రి అమర్ విమర్శలు చేశారు. పవన్ టీడీపీ లో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమే అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పవన్, చంద్రబాబు లు లోకేష్ చెరో భుజం పై మోయడానికి సిద్ధమయ్యారు. కాపులను తాకట్టు పెట్టేందుకు పవన్ సిద్ధం అయ్యారు…వేపగుంట కాపు సామాజిక భవన ప్రారంభోత్సవ సభలో పవన్ పై అమర్నాథ్ కామెంట్ చేశారు. మంత్రి కామెంట్స్ పై జనసేన కౌంటర్ ఎటాక్ చేసింది. కాపు భవన్లో సౌకర్యాలపై నిరసనలు వ్యక్తం చేసింది.

Read Also: Nephew Kills Uncle: ఆవు విషయంలో వివాదం.. మామను కొట్టి చంపిన మేనల్లుడు

ఇటు జనసేన నేతలు కూడా మంత్రి అమర్నాథ్ పై విరుచుకుపడ్డారు. మంత్రి అమర్నాథ్ జగన్మోహన్ రెడ్డికి బానిసగా మారాడన్నారు జనసేన రాష్ట్ర నాయకుడు తమ్మిరెడ్డి శివశంకర్. గాలికి మంత్రైన అమర్నాథ్ కు విజ్ఞత, విచక్షణ లేదు….ఒక పద్ధతి, ప్రోటోకాల్ అంటే తెలియని వాడు మంత్రి అవ్వడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం. అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే ఇంత కంటే తీవ్రంగా స్పందిస్తాం…మంత్రి అమర్నాథ్ కు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఒక తోక….వేపగుంటలో కాపు భవన్ కు రంగులు వేసి శిలాఫలకం కోసం హడావిడి చేశారన్నారు తమ్మిరెడ్డి శివశంకర్.

Read Also: Traffic restrictions: నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. దారి మళ్లిస్తారు ఇలా..