NTV Telugu Site icon

Harirama Jogaiah: కూటమి మేనిఫెస్టోపై స్పందించిన హరి రామజోగయ్య.. అది దురదృష్టకరం

Harirama Jogaiah

Harirama Jogaiah

Harirama Jogaiah: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల సమయంలో.. వరుసగా వివిధ అంశాలపై లేఖలు విడుదల చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య.. తాజాగా, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడంపై స్పందించిన ఆయన హాట్‌ కామెంట్లు చేశారు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరియు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోలపై మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య తాజాగా లేఖ రాశారు.. కాపు, బలిజ, ఒంటరి కులస్తులకు జనాభా ప్రాతిపదికన ఐదు శాతం కానీ విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్స్ అంశం కానీ లేకపోవడం దారుణం అన్నారు. తమ పార్టీల మేనిఫెస్టో ప్రకటనలో కాపుల రిజర్వేషన్ అంశం లేకపోవడం దురదృష్టకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన కాపుల పట్ల ఈ పార్టీలు చిన్న చూపు చూడటం బాధాకరంగా ఉన్నమాట నిజం అంటూ తన లేఖలో పేర్కొన్నారు కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య.

Read Also: Big Saving Days Sale 2024: బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌.. మోటో ఎడ్జ్‌ 40 నియోపై భారీ తగ్గింపు!

Show comments