Site icon NTV Telugu

HariHaraVeeraMallu: హరిహరవీరమల్లు అప్డేట్ వచ్చేస్తుంది.. రెడీగా ఉండండమ్మా..

hariharaveeramallu

hariharaveeramallu

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైనప్ లో పెడుతున్నాడు.. మరోవైపు ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారంలో బిజీగా ఉన్నాడు..అయితే చాలా కాలం నుంచి ఆయన సినిమాల అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.. తాజాగా శ్రీరామనవమి సందర్బంగా అదిరిపోయే అప్డేట్ వచ్చేస్తుంది.. హరిహర వీరమల్లు నుంచి టీజర్ రాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు..

ఈ సినిమాకు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా స్టార్ట్ అయి చాలా రోజులు అయ్యింది.. ఇప్పటివరకు సగం కూడా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. ఇక పవన్ కల్యాణ్ ఉన్న పొలిటికల్ కమిట్‌మెంట్స్‌తో ఈ సినిమా షూటింగ్ అప్పుడప్పుడు జరుగుతూ వస్తుంది. అయితే చిత్రం నుంచి అప్‌డేట్ వచ్చి చాలా రోజుల అయిన విషయం తెలిసిందే.. గతంలో పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా అప్డేట్ ను విడుదల చేశారు మేకర్స్.. మళ్లీ ఇన్నాళ్లకు అప్డేట్ రాబోతుందని ప్రకటించారు..

శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కాగా దీనిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజాగా మీ ముందుకు ధర్మంతో యుద్ధం త్వరలో అనే ఒక పోస్టర్ ను విడుదల చేశారు.. ఆ పోస్టర్ చక్కర్లు కొడుతుంది. ఇక ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే క్రిష్‌ టీం ఇప్పటికే రిలీజ్‌ చేసిన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇప్పుడు టీజర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..

Exit mobile version