Site icon NTV Telugu

Harihara Veeramallu:వాడొచ్చి దొంగ దొరల లెక్కలు సరి చేస్తాడు.. గూస్ బంప్స్ గ్యారెంటీ టీజర్..

Whatsapp Image 2024 05 02 At 9.09.14 Am

Whatsapp Image 2024 05 02 At 9.09.14 Am

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ “హరిహర వీరమల్లు”.ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ.దయాకర్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా గతంలో ఎప్పుడో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.ఈ సినిమా పవన్ కల్యాణ్ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది.అయితే ఈ సినిమా గత కొంతకాలంగా ఆగిపోయిందంటూ తెగ వార్తలు వచ్చాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ మరియు పోస్టర్స్ రిలీజ్ చేసి మేకర్స్ సినిమాపై అంచనాలను పెంచేశారు.. కానీ ఇప్పటి వరకుఈ సినిమాపై ఎటువంటి అప్డేట్ లేకపోవడం అలాగే ఇన్ని సంవత్సరాలైనా సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకపోవడంతో పవన్ కల్యాణ్ అభిమానులలో ఈ సినిమా ఆగి పోయిందేమో అనే అభిప్రాయం మొదలయింది కానీ ఈ మూవీ మేకర్స్ తాజాగా పవన్ ఫాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ను అందించారు .తాజాగా ఈ సినిమాకు సంబంధించి ధర్మం కోసం యుద్ధం అంటూ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు .ఈ టీజర్ చూసి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఖుషి అవుతున్నారు..ఈ టీజర్ లో పవన్ కల్యాణ్ స్టంట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి .

Exit mobile version