Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న “హరిహర వీరమల్లు” సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది. విడుదల ముందుగా చిత్రబృందం ప్రమోషన్లను జోరుగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాత ఏఎం రత్నం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆయన తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి టికెట్ ధరల పెంపు విషయంపై మాట్లాడినట్లు సమాచారం.
Google, Meta: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో.. గూగుల్, మెటాకు ఈడీ నోటీసులు
అయితే, ఇటీవల సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుపై ఆంక్షలు విధించింది. ప్రీమియర్లు నిలిపివేయడమే కాకుండా, పెరిగిన ధరలకు గడువు పెట్టింది. ఈ క్రమంలో “వీరమల్లు” చిత్రానికి కూడా అనుమతి ఇవ్వనట్లుగా తెలుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచేలా కోరామని నిర్మాత ఏఎం రత్నం తెలిపారు. మొదట తెలంగాణ ప్రభుత్వం ఇందుకు అంగీకరించలేదని అన్నారు. కానీ, ఇది చరిత్రాత్మక చిత్రం అని వివరించాక.. ఒక వారం వరకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. టికెట్ ధరలకు సంబంధించి ఇవాళ ఏపీలో జీవో వస్తుందని, ఆ తర్వాత తెలంగాణ నుంచి అధికారిక ప్రకటన ఆశిస్తున్నాం అని అన్నారు.
Fire Accident In Vizag: విశాఖలోని ఐటీసీ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ 100 కోట్ల నష్టం..?
అంతేకాకుండా.. సినిమా మీద కొంతమంది ఉద్దేశపూర్వకంగా నెగటివ్ ప్రచారం చేస్తున్నట్టు నిర్మాత రత్నం పేర్కొన్నారు. ఎంతో కష్టపడి సినిమా చేస్తే, ఔట్‌డేటెడ్ అంటున్నారు.. అసలు విడుదల కాదు అంటున్నారు. ఇది పోలిటికల్ టార్గెట్‌నా, సినిమా టార్గెట్‌నా చెప్పలేను. కానీ కావాలనే చేస్తున్నారని అనిపిస్తోంది అన్నారు. ఈ నేపథ్యంలో, “హరిహర వీరమల్లు” సినిమాకు సంబంధించి టికెట్ ధరల విషయంలో రెండు రాష్ట్రాల్లో అధికారిక ప్రకటనలు రావాల్సి ఉన్నాయి. భారీ బడ్జెట్, చారిత్రక నేపథ్యం కలిగిన ఈ సినిమా విడుదలకు ముందే చర్చల్లో నిలవడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.