Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో మొదలైన హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రీమియర్‌ల ద్వారా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా అనేకసార్లు వాయిదా పడుతూ వస్తూ ఉండటంతో క్రిష్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో నిర్మాత రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యి సినిమా పూర్తి చేశారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ప్రీమియర్‌లతో 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. కొందరు అద్భుతంగా ఉందని కొనియాడుతూంటే.. మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: India-UK Trade Deal: ఇండియా-యూకే ట్రేడ్ డీల్.. ఏ వస్తువుల ధరలు తగ్గుతాయంటే..
హరిహర వీరమల్లు రిలీజ్‌తో బాక్సాఫీసు వద్ద సందడి నెలకొంది. తాజాగా సినీ బృందం సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ మూవీలోని పవర్‌ఫుల్ పాట లిరికల్‌ను విడుదల చేసింది. ‘సలసల మరిగే నీలోని రక్తమే’ అంటూ ఈ పాట లిరికల్ వీడియో యూట్యూబ్‌లో పంచుకున్నారు. ఈ పాటను చైతన్య ప్రసాద్ రాయగా.. సాయిచరణ్ భాస్కరుని, లోకేశ్వర్, పీవీఎన్‌ఎస్ రోహిత్ తదితరులు ఆలపించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఈ పాటకు సంగీతం అందించారు.
