Hardik Pandya: మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్.. అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. $100,000 గెలుపు.!
- మిస్టర్ బీస్ట్ నిర్వహించిన ప్రత్యేక స్పోర్ట్స్ ఛాలెంజ్‌లో..
- విజేతగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా
- మిస్టర్ బీస్ట్‌ను ఓడించి 1 లక్ష అమెరికన్ డాలర్లు సొంతం
- గెలుచుకున్న మొత్తం ప్రైజ్‌మనీని సేవా కార్యక్రమాలకు విరాళంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Win MrBeast Challenge: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) క్రికెట్ మైదానాన్ని వదిలి బేస్‌బాల్ బ్యాట్ పట్టాడు. అవును.. మీరు విన్నది నిజమే. దీనికి కారణం ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ (MrBeast). అతడు నిర్వహించిన ప్రత్యేక స్పోర్ట్స్ ఛాలెంజ్‌లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఈ పోటీలో ఏకంగా 1 లక్ష అమెరికన్ డాలర్లు (సుమారు రూ.94.9 లక్షలు) గెలుచుకున్నాడు హార్దిక్ పాండ్యా. అయితే ఈ మొత్తాన్ని హార్దిక్ దగ్గర ఉంచుకోకుండా.. సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలని కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
జిమ్మీ డొనాల్డ్సన్గా ప్రసిద్ధి చెందిన మిస్టర్ బీస్ట్.. ప్రపంచవ్యాప్తంగా పేరున్న క్రీడాకారులు, ప్రముఖులతో కలిసి ఈ ఛాలెంజ్ వీడియోను రూపొందించాడు. ఇందులో హార్దిక్ పాండ్యాతో పాటు బాస్కెట్‌బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్, బాస్కెట్‌బాల్ స్టార్ కైట్లిన్ క్లార్క్, జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, ఫిగర్ స్కేటర్ అలైసా లియు వంటి ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. భారత యూట్యూబర్ క్యారీ మినాటీ కూడా ఈ వీడియోలో కనిపించాడు. ఈ పోటీలో హార్దిక్ పాండ్యా, మిస్టర్ బీస్ట్ మధ్య బేస్‌బాల్ హోమ్రన్ ఛాలెంజ్ నిర్వహించారు. వీరిద్దరికి బంతిని మైదానం బయటకు కొట్టడమే ఆట లక్ష్యం. మూడు బంతులను బౌండరీ అవతలకు పంపించాల్సి ఉంటుంది. అయితే సాధారణ బేస్‌బాల్ మ్యాచ్‌ల్లో మాదిరిగా వేగంగా బంతులు వేయకుండా.. యూట్యూబర్ సులభంగా కొట్టేలా బంతులను వేశాడు. తనకు ఇంతకుముందు బేస్‌బాల్ ఆడిన అనుభవం లేదని హార్దిక్ చెప్పినప్పటికీ.. అద్భుతంగా ఆడి మిస్టర్ బీస్ట్‌పై విజయం సాధించాడు.
Also Read
- Pulivendula Re-Polling: రీ-పోలింగ్‌పై గందరగోళం.. పులివెందులలో ఇంకా తెరుచుకోని పోలింగ్ కేంద్రం!
- UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
- Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
- IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
ఈ విజయంతో లభించిన లక్ష డాలర్ల ప్రైజ్‌మనీని హార్దిక్ పూర్తిగా ఛారిటీకి కేటాయించాడు. జంతు సంక్షేమం, నిరుపేద పిల్లల సహాయానికి కృషి చేస్తున్న సంస్థలకు ఈ మొత్తాన్ని అందించాలని కోరాడు. ముఖ్యంగా ఏబిలిటీ డెవలప్మెంట్ అండ్ ఇన్‌క్లూజన్ (ADAPT), కమ్యూనిటీ స్ట్రీటీస్ ఇండియా (Community Streeties India) సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సంస్థలు జంతు సంక్షేమం, సామాజిక సేవా కార్యక్రమాల్లో పనిచేస్తున్నాయి.
మరోవైపు హార్దిక్ పాండ్యా క్రికెట్ భవిష్యత్తుపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. అతను చివరిసారిగా 2026 మార్చిలో అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తరఫున ఆడాడు. ఆ తర్వాత మే 24న ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ మ్యాచ్‌లో చివరిసారిగా మైదానంలో కనిపించాడు. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. కాలి కండరాల లోపలి భాగంలో ఏర్పడిన స్ట్రెస్ ఇంజ్యూరీ కారణంగా హార్దిక్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. అక్టోబర్ ప్రారంభంలో వైద్య నిపుణుడు డాక్టర్ దిన్షా పార్దివాలా అతని వైద్య నివేదికలను పరిశీలించబోతున్నారు. రికవరీ ప్రణాళికలో భాగంగా నవంబర్‌లో జాగింగ్ ప్రారంభించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
మొదట జాగింగ్ ప్రారంభించి, ఆ తర్వాత ఎనిమిది వారాల పాటు క్రమంగా పరుగుల సాధనను పెంచనున్నారు. గాయం తిరగబెట్టకుండా జాగ్రత్తగా బలవర్ధక వ్యాయామాలు కూడా చేయించనున్నారు. అయితే పూర్తి ఫిట్నెస్ సాధించి మైదానంలోకి ఎప్పుడు వస్తాడనే దానిపై ఇప్పటివరకు స్పష్టమైన గడువు తెలపలేదు. పాండ్యా కోలుకోవడం ఆలస్యమైతే 2027 మార్చిలో ప్రారంభం కానున్న ఐపీఎల్ వరకు క్రికెట్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే శ్రీలంక, జింబాబ్వేతో భారత్ ఆడనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కూడా హార్దిక్ దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో అతనికి చోటు దక్కలేదు. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ.. మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్‌లో విజయం సాధించడం, వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వడం ద్వారా హార్దిక్ మరోసారి వార్తల్లో నిలిచాడు.
Hardik Pandya featured in Mr Beast’s video today 👀🔥 https://t.co/6PbfknXdQw
— 𝐕♛ (@DelhiKaKing18) October 31, 2026
తాజావార్తలు
-
Hardik Pandya: మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్.. అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. $100,000 గెలుపు.!
-
Bhuvneshwar Kumar: 180 రన్స్, ఒకే వికెట్.. భువనేశ్వర్‌ను ఆడించడం పెద్ద తప్పిదం!
-
Mahindra UDO Electric Auto: మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200KM రేంజ్, 5 గంటల్లో ఫుల్ ఛార్జ్!
-
LA Wildfires: కార్చిచ్చు..! ప్రమాదంలో 70లక్షల ప్రాణాలు..
-
Pulivendula Re-Polling: రీ-పోలింగ్‌పై గందరగోళం.. పులివెందులలో ఇంకా తెరుచుకోని పోలింగ్ కేంద్రం!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?