NTV Telugu Site icon

Hardik Pandya: తిరిగి టీమిండియాలోకి రావడం నా చేతుల్లో లేదు.. ఐపీఎల్‌పైనే నా దృష్టి

Hardik Pandya

Hardik Pandya

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో టీమిండియా ఆల్‌రౌండన్ హార్డిక్ పాండ్యా నేతృత్వం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల ద్వారా పాయింట్ల పట్టికలో ఆ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. హార్డిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ వదిలేయడం గుజరాత్ టైటాన్స్‌కు కలిసొచ్చిందనే చెప్పాలి. మహా జట్లను తోసిరాజని టైటిల్ రేసులో గుజరాత్ టైటాన్స్ దూసుకుపోతుందంటే దానికి కారణం హార్డిక్ పాండ్యానే. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్లలోనూ అతడు తనదైన మార్క్ చూపిస్తున్నాడు.

ప్రస్తుత ప్రదర్శనతో త్వరలోనే హార్డిక్ పాండ్యా టీమిండియాలోకి వస్తాడని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో హార్డిక్ పాండ్యా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను మళ్లీ టీమిండియాలోకి వస్తానని భావించడం లేదని.. ఆ అంశం తన చేతుల్లో లేదని హార్డిక్ పాండ్యా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం తాను ఐపీఎల్‌ గురించే ఆలోచిస్తున్నానని… వేరే విషయం గురించి పట్టించుకోవడం లేదని స్పష్టం చేశాడు. ఐపీఎల్ తర్వాత తన భవిష్యత్ ఎక్కడికి వెళ్తుందో వేచి చూడాల్సిందేనని, అది తన చేతుల్లో లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ సాధించి పెట్టడంపైనే తన దృష్టి కేంద్రీకృతం చేశానన్నాడు. ఐపీఎల్‌లో తన ఆటతీరు పరంగా చాలా సంతృప్తిగా ఉన్నానని తెలిపాడు. తన ఆట మెరుగవ్వడంలో కెప్టెన్సీ ఎంతో ఉపకరించిందని వివరించాడు. బాధ్యతలను తీసుకునేందుకు తాను ఇష్టపడతానని.. ఆటను బాగా అర్థం చేసుకున్నప్పుడే విజయం సాధించగలుగుతామని హార్డిక్ పాండ్యా చెప్పాడు.

IPL 2022 : ఆరెంజ్‌ ఆర్మీ దూకుడు.. ఆర్సీబీపై విజయం..