Hardik Pandya Ruled Out Of ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకెళుతున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ప్రపంచకప్ 2023లోని మిగతా మ్యాచ్‌లకు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. చీలమండ గాయం నుంచి ఇంకా కోలుకొని హార్దిక్.. మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో పేసర్ ప్రసిధ్ కృష్ణ భారత జట్టుకు ఎంపికయ్యాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌కు ప్రసిధ్ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
గత నెలలో పూణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో అతడి ఎడమ చీలమండకు గాయమైంది. హార్దిక్ గాయం ఇంకా నయం కాలేదు. నొప్పితో బాధపడుతున్న హార్దిక్ కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందట. దాంతో అతడు ప్రపంచకప్ 2023 నుంచి తప్పుకున్నాడు. సెమీస్‌కు ముందు ఇది టీమిండియాకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమిలో హార్దిక్ ఉన్నాడు.
ఆల్‌రౌండర్‌గా సేవలు అందిస్తోన్న హార్దిక్ పాండ్యా చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. ఇక నాలుగు మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు. ప్రసిధ్ కృష్ణ ఇప్పటివరకు 17 వన్డేలు మాత్రమే ఆడాడు. ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాపై తొమ్మిది ఓవర్లలో 45 రన్స్ ఇచ్చి డేవిడ్ వార్నర్ వికెట్‌ను పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఫామ్ దృష్ట్యా కృష్ణకు చోటు దక్కడం కష్టమే.
Hardik Pandya ruled out of the World Cup 2023.
– Prasidh Krishna replaces Hardik Pandya in the team. pic.twitter.com/HMOkdKojKL
— Johns. (@CricCrazyJohns) November 4, 2023