Mercedes-Benz V-Class: గర్ల్ ఫ్రెండ్ కు రూ. 1.7 కోట్ల విలువైన కారును బహుమతిగా ఇచ్చిన హార్దిక్ పాండ్యా..!

  • హార్దిక్ పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్‌కు ఖరీదైన గిఫ్ట్
  • 1.7 కోట్ల విలువైన Mercedes-Benz V-Class బహుమతి
  • జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
  • మాహికా శర్మ తన విజయాల్లో కీలకమని పాండ్య వ్యాఖ్య..
Hardik Pandya Girlfriend Gift

Hardik Pandya Girlfriend Gift

Mercedes-Benz V-Class: టీమిండియా స్టార్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ ‘హార్దిక్ పాండ్యా’ మైదానంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ అనేకసార్లు వార్తల్లో నిలుస్తున్నారు. గత కొద్దిరోజులుగా తన గర్ల్ ఫ్రెండ్ మాహికా శర్మపై ఉన్న ప్రేమను చూపిస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు హార్దిక్ ఓ ఖరీదైన కానుకను తన గర్ల్ ఫ్రెండ్ కు అందించారు. దాదాపు రూ. 1.7 కోట్ల విలువైన సరికొత్త మెర్సిడెస్ బెంజ్ V-క్లాస్ (Mercedes-Benz V-Class) లగ్జరీ కారును ఆమెకు బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. భారతదేశంలోనే అత్యంత విలాసవంతమైన వాహనాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ మోడల్ కారును హార్దిక్ తన ప్రియురాలికి గిఫ్ట్ గా ఇచ్చాడు.

BRS MLCs Suspended: శాసన మండలి హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మూకుమ్మడి సస్పెన్షన్!

కొద్దిరోజుల క్రితమే హార్దిక్ తన కోసం రూ. 12 కోట్ల విలువైన ఫెరారీ కారును కొనుగోలు చేశారు. ఇప్పుడు మాహికాకు ఈ ప్రీమియం కారును గిఫ్ట్‌గా ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట కారుతో దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యనే పాండ్య నా విజయాల్లో మాహికా పాత్ర ఎంతో ఉందని హార్దిక్ పలు సందర్భాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. కేవలం వ్యక్తిగత జీవితంలోనే కాకుండా, క్రికెట్ మైదానంలోనూ హార్దిక్ పాండ్యా సత్తా చాటుతున్నారు.

Migraine in Women: మహిళల్లో అమాంతంగా పెరుగుతున్న ‘మైగ్రేన్’ సమస్య.. కారణాలు ఇవే.. జాగ్రత్త సుమీ.!

ఇక ఆదివారం వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 2012 తర్వాత ముంబై ఇండియన్స్ ఓ ఐపీఎల్ సీజన్ లో తమ తొలి మ్యాచ్‌ ను గెలవడం ఇదే మొదటిసారి. ఈ గెలుపుతో ముంబై తమ చెత్త రికార్డును చెరిపివేసింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (78), ర్యాన్ రికెల్టన్ (81) మెరుపు హాఫ్ సెంచరీలతో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు.