NTV Telugu Site icon

Hardik Pandya: టెస్టుల్లో రీఎంట్రీపై హార్దిక్ పాండ్యా రియాక్షన్ ఇదే!

Pandya12

Pandya12

హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం టీమిండియా టీ20 జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే వ‌న్డేల్లోనూ కీల‌క ప్లేయ‌ర్‌గా కొన‌సాగుతోన్నాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణిస్తూ జ‌ట్టుకు ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్నాడు. గాయాల కారణంగా టెస్టు క్రికెక్‌కు దూర‌మైన పాండ్యా వ‌న్డేలు, టీ20ల్లో మాత్రమే ఆడుతున్నాడు. 2017లో శ్రీలంక‌తో జ‌రిగిన టెస్టు మ్యాచ్ ద్వారా పాండ్యా టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 11 టెస్టులు ఆడాడు. 2018లో ఇంగ్లాండ్‌తో చివ‌రి టెస్టు ఆడాడు. తాజాగా టెస్టుల్లో రీఎంట్రీపై పాండ్యా ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. టెస్టుల్లోకి తప్పకుండా రీఎంట్రీ ఇస్తాన‌ని తెలిపాడు. అయితే అది ఎప్పుడనేది మాత్రం వెల్లడించలేదు.

Also Read: Wasim Jaffer: రోహిత్, కోహ్లీ టీ20 వరల్డ్‌కప్‌లో ఆడరు: జాఫర్

ప్రస్తుతం త‌న దృష్టి మొత్తం పరిమిత ఓవర్ల క్రికెట్‌పైనే ఉంద‌ని పాండ్యా స్పష్టం చేశాడు. వ‌న్డేలు, టీ20ల‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. స‌రైన టైమ్ కుద‌ర‌డంతో పాటు ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ స‌హ‌క‌రిస్తే తప్పకుండా టెస్టుల్లో రీ ఎంట్రీ ఇస్తాన‌ని పాండ్యా పేర్కొన్నాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్ ముందు హార్డిక్ పాండ్యా టెస్టు క్రికెట్ రీఎంట్రీపై చేసిన ఈ వ్యాఖ్యలు ఆస‌క్తిక‌రంగా మారాయి. న్యూజిలాండ్‌తో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయ‌డ‌మే కాకుండా 30 ర‌న్స్ చేసి ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు హార్దిక్.

Also Read: ChatGPT: దూసుకెళ్తున్న చాట్‌జీపీటీ.. రెండు నెలల్లోనే రికార్డు యూజర్లు