NTV Telugu Site icon

IPL 2023 : సాహాను బ్లైండ్ గా నమ్మిన హార్థిక్

Hardik

Hardik

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ మధ్యలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. రివ్యూ విషయంలో క్లారిటీ లేని కెప్టెన్ హార్థిక్ పాండ్యా కీపర్ సాహాను గుడ్డిగా నమ్మాడు. పంజాబ్ ఇన్సింగ్స్ 13వ ఓవ్ మోహిత్ శర్మ వేశాడు. ఔట్ సైడ్ దిశగా వెళ్తున్న బంతిని పంజాబ్ బ్యాటర్ జితేశ్ శర్మ ట్రై చేసి మిస్ చేశాడు. దీంతో బంతి కీపర్ సాహా చేతుల్లోకి వెళ్లి పడింది. బంతిని అందుకున్న సాహా ఔట్ అంటూ అంపైర్ కు అప్పీల్ చేశాడు. అయితే బౌలర్ మోహిత్ శర్మ సహా కెప్టెన్ హార్థిక్ పాండ్యాలు తమకు బ్యాటకు బంతి టచ్ అయినట్లుగా ఎలాంటి శబ్దం రాలేదని చెప్పారు. కానీ వృద్దిమాన్ సాహా మాత్రం లేదు నాకు సౌండ్ వచ్చింది బంతి బ్యా్ట్ కు తాకింది అని బలంగా చెప్పాడు.

Read Also : Plane Crash: 1976లో విమాన ప్రమాదం..సీఎంతో సహా 10 మంది మృతి.. 47 ఏళ్ల తర్వాత నిజం తెలిసింది..

దీంతో అప్పటికే డీఆర్ఎస్ సమయం ముగిసిపోవడానికి ఒక్క సెకండ్ మాత్రమే మిలిగింది. అలా చివరి సెకన్ లో సాహాను నమ్మిన హార్థిక్ పాండ్యా రివ్యూ కోరాడు. ఒక రిప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్ ను తాకినట్లు అల్ట్రా ఎడ్జ్ లో స్పైక్ రావడంతో జితేశ్ శర్మ అవుట్ అయినట్లు అంపైర్ ప్రకటించారు. దీంతో హార్థిక్ పాండ్యా నవ్వుకుంటూ వృద్దిమాన్ సాహా దగ్గరకు వెళ్లి హగ్ ఇచ్చి అభినందించాడు. కెప్టెన్, బౌలర్ ఔట్ విషయంలో నమ్మకంతో లేనప్పుడు సాహా మాత్రం తన మాటకే కట్టుబడి రివ్యూ కోరి ఫలితం అందరిని ఆకట్టుకుంది.

Read Also : Ambedkar Statue: సాగర తీరంలో రాజ్యాంగ నిర్మాత.. నేడు అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ