NTV Telugu Site icon

Harassment: సైకిల్పై వెళ్తున్న విద్యార్థినిపై వేధింపులు.. ఆ తర్వాత ఏమైందంటే..?

Up Harrasment

Up Harrasment

ఉత్తరప్రదేశ్ లో రెండ్రోజుల క్రితం జరిగిన సంఘటనే మరొకటి జరిగింది. మొన్న అంబేద్కర్ నగర్ లో చోటు చేసుకోగా.. ఇప్పుడు మొరాదాబాద్ జిల్లాలో జరిగింది. పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న విద్యార్థినిని.. ఆగంతకులు వేధించారు. దీంతో విద్యార్థిని నిరసన వ్యక్తం చేయడంతో.. దుండగులు అక్కడి నుండి పారిపోయారు. అనంతరం విద్యార్థిని ఇంటికి వెళ్లే మార్గంలో.. మళ్లీ విద్యార్థిని వెంబడించారు. అంతేకాకుండా.. తన సైకిల్‌ను అతి వేగంతో ఢీకొట్టారు. దీంతో విద్యార్థిని కింద పడిపోగా.. బైక్‌పై నుంచి వచ్చి విద్యార్థినిపై పదునైన ఆయుధంతో దాడి చేసి పరారయ్యారు. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని రోడ్డుపైనే పడి ఉండటంతో.. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి.. తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఆ విద్యార్థిని చికిత్స పొందుతోంది.

Road Accident: కెనాల్‌లోకి దూసుకెళ్లిన బస్సు.. 8 మంది మృత్యువాత

వివరాల్లోకి వెళ్తే.. ఈ సంఘటన కాంత్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గత సోమవారం 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని స్కూల్ నుంచి ఇంటికి వెళుతుండగా.. కొందరు యువకులు బైక్‌పై వచ్చి ఆమెను వెంబడించి వేధించారు. అంతేకాకుండా.. బైక్‌ తో ఆమె సైకిల్‌ను ఢీకొట్టడంతో విద్యార్థిని కిందపడిపోయింది. దీంతో ఓ యువకుడు ఆమెపై బలవంతంగా దాడికి యత్నించాడు. ఆ సమయంలో విద్యార్థిని నిరసన వ్యక్తం చేయడంతో.. యువకుడు బాలికపై కత్తితో దాడి చేశాడు. దీంతో విద్యార్థిని మెడ, ముఖంపై గాయమైంది.

Bandi Sanjay: మహిళా బిల్లు విషయంలో ఆ రెండు పార్టీలు ద్వంద్వ వైఖరి మార్చుకోవాలి..

ప్రస్తుతం బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. గుర్తు తెలియని యువకుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎస్‌ఎస్పీ హేమ్‌రాజ్ మీనా మాట్లాడుతూ.. విద్యార్థినిపై వేధింపుల కేసు వెలుగులోకి వచ్చిందని తెలిపారు. గుర్తు తెలియని నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని.. నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. బాలిక తల్లిదండ్రులు ఇద్దరు యువకులపై అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని.. విద్యార్థినిని విచారించగా కొందరి పేర్లు చెప్పినట్లు తెలిపారు. వారిని అరెస్టు చేసి జైలుకు పంపేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారని ఎస్‌ఎస్పీ హేమ్‌రాజ్ మీనా పేర్కొన్నారు.