మహారాష్ట్రలోని పూణెలో వరుస వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అనూప్ వానీగా గుర్తించారు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి అమ్మాయిలను వేధించేవాడని పోలీసులు తెలిపారు. దాదాపు 18 మంది బాలికలను వేధించాడని వారు పేర్కొన్నారు. నిందితుడు పూణేలోని శనివారం పేటలో నివసిస్తుంటాడని.. వేధింపులు ఎదుర్కొన అమ్మాయిల్లో.. ఓ అమ్మాయి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడు అనూప్ వానీని పోలీసులు అరెస్టు చేశారు.
Old City Metro : పాతబస్తీలో మెట్రో… సన్నాహక పనులను ప్రారంభించిన హెచ్‌ఎంఆర్‌ఎల్
బాలిక ఫిర్యాదు మేరకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అనూప్ వానీ రోజూ అమ్మాయిలను వేధించేవాడని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా విచారించగా.. అతను మతిస్థిమితం కోల్పోయినట్లు తెలిసింది. నిందితుడు అనూప్ వానీ.. బాలికలను వేధించడానికి ఓ ప్లాన్ వేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. కాలినడకన వెళ్తున్న అమ్మాయిలను టార్గెట్ గా చేసుకొని.. వారి కోసం వెతికేవాడు. ఆ తరువాత అతను వారితో తాను అనారోగ్యంగా ఉన్నానని చెప్పేవాడు. అందుకోసం తనను తన స్కూటీపై తన ఇంటి వద్ద దింపమని వారిని అడిగేవాడు. అలా ట్రాప్ చేసి.. అమ్మాయిలను అతని వలలో పడేసుకున్నాడు. అంతేకాకుండా బాలికలను ఇంటి దగ్గర దింపేందుకు స్కూటీపై వెళుతుండగా.. ఆ సమయంలో వెనుక కూర్చున్న అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు.
Opposition Meeting: బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం.. హాజరుకానున్న ముఖ్య పార్టీ నేతలు..!
మరోవైపు విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు. తాను ఇప్పటివరకు 18 మంది బాలికలను వేధించినట్లు పోలీసులకు చెప్పాడు. ఈ ఘటనపై నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేలా వేధింపులకు గురైన ఇతర బాలికలు కూడా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.