Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినులకు వేధింపులు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basara IIIT: ఇటీవల కాలంలో నిత్యం ఏదో విధంగా వార్తలో నిలుస్తోంది బాసర ట్రిపుల్ ఐటీ. నిన్న మొన్నటి వరకు హాస్టల్ సమస్య కొనసాగుతుండగానే.. మరో వివాదం వెలుగులోకి వచ్చింది. కాలేజీ ఉద్యోగులు విద్యార్థినులు వేధిస్తున్నారంటూ వార్త ప్రచారం జరుగుతోంది. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినులను వేధించిన ఘటనలో బుధవారం ఇద్దరు కాలేజీ ఉద్యోగులను అధికారులు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఓ విభాగంలోని అటెండర్ విద్యార్థులను బ్లాక్ మెయిల్ చేయగా అధికారులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బయటపడినట్లు సమాచారం. ఆ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉద్యోగుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రహస్య విచారణ చేస్తున్నట్లు సమాచారం.
Read Also: Yadadri Thermal Power Plant : యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఎంత వరకు సేఫ్ ? అనుమతిపై మరోమారు అధ్యయనం
Also Read
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Ketan Agarwal case: కేతన్‌ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
- Delhi Court: ఆ టైమ్‌లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
ఈ ఘటన పై ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగి చెబుతూ తనకు దగ్గరి బంధువులు కావడంతో పలకరించేవాడినన్నాడు. అతని భార్యను కళాశాలలోని భవనంలో అధికారులు రహస్యంగా విచారించినట్టు తెలిసింది. సదరు విద్యార్థినులతో తమకు బంధుత్వం లేదని ఆమె స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు వివరించిన కాలేజీ అధికారులు ఓ కమిటీ వేసి రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. కాగా, మరో ఉద్యోగికి సైతం ఈ వ్యవహారంతో సంబంధం ఉండగా.. తను విధులు నిర్వర్తించే సెక్షన్‌లో అవకతవకలకు పాల్పడినందుకు వేటు వేసినట్లు కళాశాల వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై కళాశాల డైరెక్టర్‌ను సంప్రదించగా.. కొందరు కళాశాల నియమాలను అతిక్రమించినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై ఏకసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఏ అంశంపై కమిటీని ఏర్పాటు చేశారని ప్రశ్నించగా జవాబు దాటవేశారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
-
Ketan Agarwal case: కేతన్‌ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్‌లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!