NTV Telugu Site icon

Harassment: మహిళ అసభ్యకర ఫోటోలు తీస్తూ వేధింపులకి గురి చేసిన డిప్యూటీ త‌హ‌సీల్దార్.. వీడియో వైరల్..

13

13

ఈ మధ్యకాలంలో కొందరు మూర్ఖులు చదువుకున్నా కానీ ఎదుటివారిని హింసించడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. వారి ఆనందం కోసం ఎదుటివారిని హింసించడం ఈ మధ్య చాలా పరిపాటుగా మారిపోయింది. ఇకపోతే తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే..

Also read: Kishan Reddy: తొమ్మిది ఏళ్లల్లో తెలంగాణకి కేంద్రం పది లక్షల కోట్లు ఇచ్చింది..

ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న డిప్యూటీ తాసిల్దార్ చెంప చెల్లుమనిపించింది ఓ ఇల్లాలు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఓ ఇంట్లో డిప్యూటీ తాసిల్దార్ నివాసం ఉంటున్నాడు. అతను నివాసం ఉంటున్న పక్క పోషన్ లో ఓ మహిళ పట్ల డిప్యూటీ తాసిల్దార్ ఆసభ్యంగా ప్రవర్తించాడు.

Also read: Rohit Sharma: నేను ఎవరినీ కలవలేదు.. అవన్నీ అవాస్తవాలే: రోహిత్ శర్మ

మహిళపై లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న అతడిని తాజాగా మహిళ చెంపదెబ్బ వేసింది. తాసిల్దార్ తన ఫోన్ లో ఫోటోలు, వీడియోలు తీస్తూ ఆమెను వేధిస్తున్నాడని బాధ్యత మహిళ వాపోయింది. దాంతో తనకి కోపం వచ్చి డిప్యూటీ తాసిల్దార్ వేధింపులు భరించలేక అతనిపై చేయి చేసుకున్నట్లు తెలిపింది. ఈ విషయం జరిగాక సమాచారాన్ని తన భర్తకు చెప్పినట్లు వాపోయింది. ఈ విషయం సంబంధించి సదర మహిళ భర్త డిప్యూటీ తాసిల్దార్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన సిసిఫోటేజ్ ను కూడా పోలీసులకు ఇచ్చాడు.