నేడు భారతదేశ దిగజ్జ క్రీడాకారులలో ఒకరైన సచిన్ టెండూల్కర్ నేడు 51 ఏడాదిలో అడుగుపెట్టాడు. క్రికెట్ చరిత్రలో తనకంటూ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచాడు సచిన్. ‘మాస్టర్ బ్లాస్టర్’ గా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించాడు. సోషల్ మీడియా వేదికగా సచిన్ టెండూల్కర్ కి క్రీడారంగం వైపు నుండి, అలాగే రాజకీయ రంగం వైపు నుండి కూడా పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖులు. ఇక ప్రపంచవ్యాప్తంగా సచిన్ అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా ఆయనకు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇకపోతే తాజాగా ఆయన కార్యక్రమంలో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో విశేషాలు చూస్తే..
తనకి అందరికంటే ముందు శుభాకాంక్షలు తెలిపిన వారి గురించి ఆయన ప్రత్యేకంగా పోస్ట్ చేయడం విశేషం. సచిన్ భార్య అంజలితో కలిసి ‘సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఆయన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి మాట్లాడుతూ.. నేను ఈ పుట్టినరోజును చాలా విభిన్నంగా చేసుకోవడం చాలా బాగుందని., ఫౌండేషన్ మద్దతుతో ఎదుగుతున్న చిన్నారుల మధ్య వేడుకలు చేసుకోవడం అద్భుతంగా భావిస్తున్నట్లు తెలిపాడు. నేడు పిల్లలతో కలిసి ఫుట్బాల్ ఆడానని.. ఎన్నో స్టోరీలు పంచుకున్నానని.. నాకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మీరే ఫస్ట్ అనుకుంటా అని తెలిపారు.
ఇక పుట్టినరోజు వేడుకలు విభిన్నంగా జరగడంతో ఇలాంటి అనుభూతితో ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకంగా మారిపోయింది అంటూ సచిన్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
