NTV Telugu Site icon

Happy Birthday Pawan Kalyan: నీలాంటి నాయకుడే కావాలి.. అద్భుతాలు నువ్వు మాత్రమే చేయగలవు: చిరు

Chiranjeevi Pawan Kalyan

Chiranjeevi Pawan Kalyan

Happy Birthday Pawan Kalyan: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ‘మెగాస్టార్’ చిరంజీవి తన సోదరుడు పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఈ రోజుల్లో పవన్‌ లాంటి నాయకుడు కావాలని, అద్భుతాలు పవర్ స్టార్ మాత్రమే చేయగలరు అని పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం పవన్‌కు పుట్టినరోజు వస్తుంటుంది కానీ.. ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం అని ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు ఓ ప్రత్యేక ఫొటోను చిరంజీవి షేర్‌ చేశారు.

Also Read: Pawan Kalyan Birthday: పవన్‌ కల్యాణ్‌కు స్పెషల్ విషెస్ చెప్పిన రామ్‌ చరణ్‌!

‘కళ్యాణ్ బాబు.. ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది కానీ.. ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావాల్సిన సమయంలో కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు, దీర్ఘాయుష్మాన్ భవ’ అని చిరంజీవి పేర్కొన్నారు.

Show comments